Prime9

Honor Killing: మరో పరువు హత్య..

Anantapur District: అనంతపురం జిల్లాలో గత కొన్ని నెలలుగా వరుస పరువు హత్యలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అయితే తాజాగా అటువంటి సంఘటనే మరొకటి జరిగింది. తక్కువ కులం వ్యక్తిని ప్రేమించిందనే నెపంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురుని కర్కశంగా హతమార్చాడు ఓ కసాయి తండ్రి.

అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం చర్లోపల్లికి చెందిన 18 ఏళ్ల కూతురిని తండ్రి గుర్రప్ప అత్యంత దారుణంగా హత్య చేశాడు. తక్కువ కులం వ్యక్తిని ప్రేమించిందనే నెపంతో కుమార్తెను చంపేశాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే కూతురిని హత్య చేసిన అనంతరం గుర్రప్ప పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
కూతురు పెళ్లికి ముందే వేరే తక్కువ కులం వ్యక్తి వల్ల గర్భం దాల్చడం వల్లే హత్య చేసినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే స్థానికులు మాత్రం ఇది పరువు హత్య కాదని అంటున్నారు. తన తల్లిదండ్రుల గొడవ పడుతుండగా కూతురు మధ్యలో తలదూర్చి ప్రమాదవశాత్తు కింద పడిపోయిందని, దానితో తలకు తీవ్రమైన గాయం కావడంతో మృతి చెందిందని బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

ఇదీ చదవండి:  భర్త పై వేడినూనె పోసిన భార్య

Exit mobile version
Skip to toolbar