Site icon Prime9

Honey Trap: అర్థరాత్రి అమ్మాయి నుంచి వీడియో కాల్… తర్వాత ఏం జరిగిందంటే..

honey trap in Kurnool

honey trap in Kurnool

Honey Trap: సాధారణంగా అమ్మాయిలకు కాల్ చేసిమరీ అత్యాశక్తితో మాట్లాడుతుంటారు అబ్బాయిలు. అదే అమ్మాయి నుంచి అర్థరాత్రి వీడియో కాల్ వస్తే.. ఇంక మనోడు ఆగుతాడా కాల్ లిఫ్ట్ చేసి కాసేపుమాట్లాడు. అంతే ఇంక జరగాల్సిందంతా జరిగిపోయింది. సీన్ కట్ చేస్తే కాపాడండి సారూ అంటూ అధికారులను వేడుకుంటున్నాడు. కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఈ హనీట్రాప్ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

 ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో పట్టణంలో నివాసం ఉంటున్న సునీల్ అనే యువకుడికి అర్ధరాత్రి అన్నోన్ నంబర్ నుండి వీడియో కాల్ వచ్చింది. ఎవరో అని కాల్ లిఫ్ట్ చేసిన అతడు ఒక్కసారిగా అవక్కాయ్యాడు. కాల్ ఎత్తగానే ఓ మహిళ తన దుస్తులు తీసేస్తూ కాల్ మాట్లాడుతోంది. వెంటనే సునీల్ కాల్ కట్ చేశాడు. అయితే, ఆ కొద్దిసేపు కాల్ అతని కొంప ముంచింది. మాట్లాడిన కొద్దిసేపు కాల్‌ను కూడా అవతలి వాళ్లు రికార్డ్ చేశారు.

సునీల్ ఓ మహిళతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతున్నట్లుగా వీడియో క్రియేట్ చేసి దానిని మరల సునీల్కే పంపి బెదిరించసాగారు. ఆ వీడియో చూసిన సునీల్ కు ఏం పాలుపోక తలపట్టుకున్నాడు. ఇంతలోనే వీడియో పంపిన మహిళ నుంచి మరో మెసేజ్ వచ్చింది. డబ్బులు ఇవ్వాలని లేకుంటే ఆ వీడియోను సోషల్ మీడియాలోనూ మరియు అతని స్నేహితులకు షేర్ చేస్తానునంటూ బ్లాక్ మెయిల్ చేసింది. తన దగ్గర డబ్బులేదని వీడియోను డిలీట్ చెయ్యాలంటూ వేడుకున్నప్పటికీ వినకుండా సునీల్‌కు చెందిన ఇద్దరు మిత్రులకు ఆ వీడియోను షేర్ చేశారు.

ఇదిలా ఉండగా.. సునీల్‌కి మరో నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. తాము సిబిఐ అధికారులమని, నీ వీడియో యూట్యూబ్‌లో వచ్చిందని, వెంటనే డబ్బులు ఇచ్చి దానిని డిలీట్ చేయించుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ వేధింపులు తాళలేక బాధితుడు సునీల్.. పోలీసులను ఆశ్రయించాడు. సునీల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: Chandigarh University: 60 మంది అమ్మాయిల బాత్రూం వీడియోలు లీక్… ఆ యూనివర్సిటీలో హైటెన్షన్

Exit mobile version