Site icon Prime9

Chennai: బిర్యానీ వివాదం.. భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

Biryani dispute husband pours kerosene on wife and sets her on fire in chennai

Biryani dispute husband pours kerosene on wife and sets her on fire in chennai

Chennai: భార్యాభర్తలన్నాక గొడవలు సహజం. కొన్నిసార్లు చిన్నచిన్న విషయాలే పెద్ద ఘర్షణలకు తావిస్తాయి. మరికొన్నిసార్లు ఎవరో ఒక్కరూ కూల్‌ అవడం వల్ల తగాదాలు సర్ధుకుంటాయి. అయితే అక్కడ ఎవరు క్షణికావేషానికి లోనైనా కానీ భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇలాంటి కోవకు చెందిన ఘటనే చైన్నైలో ఒకటి చోటుచేసుకుంది. మొన్నామధ్య కూరలో ఉప్పు తక్కువందని భార్యను ఓ భర్త అతికిరాతంగా చంపేశాడు. ఇలాంటి ఘటనే ఇప్పుడు మరోకటి తాజాగా వెలుగుచూసింది. బిర్యానీ విషయంలో వృద్ధ దంపతుల మధ్య చెలరేగిన తగాదా భార్యకు నిప్పంటించేలా చేసింది. మరి ఈ ఘటన ఎక్కడ ఎప్పుడు జరిగిందో చూసేద్దాం.

కరుణాకరన్ (75) అనే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి, అతని భార్య పద్మావతి (66)తో కలిసి చెన్నై అయనవరం ఠాగూర్‌ నగర్‌లో నివసించేవారు. కాగా గత రాత్రి ఇంటికి బిర్యానీ తెచ్చుకున్న కరుణాకరన్ భార్యకు ఇవ్వకుండా తాను ఒక్కడే తినేశాడు. దానితో నాకెందుకు తీసుకురాలేందంటూ కరుణాకరణ్ ను పద్మావతి ప్రశ్నించింది. ఇంకేముంది అది కాస్త చిలికిచిలికి గాలివానలా మారినట్టు పెద్ద వివాదంగా దారితీసింది. మాటామాట పెరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన కరుణాకరన్‌ భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆ మంటల్లో చిక్కుకుని అరుస్తూ పద్మావతి వెళ్లి భర్త కరుణాకరణ్ ను కౌగిలించుకుంది. దానితో వృద్ధ దంపతుల ఇద్దరికి నిప్పంటుకుంది. వారి అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలార్పేశారు. వారిరువురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఇలా బిర్యానీ విషయంలో తలెత్తిన గొడవ కాస్త ఆ వృద్ధ దంపతుల ప్రాణాల మీదకు తెచ్చింది.

ఇదీ చదవండి: మద్యం మత్తులో అమ్మాయిల వీరంగం.. నడిరోడ్డుపై ఏం చేశారో చూస్తే షాక్

Exit mobile version