Site icon Prime9

Crime News: ప్రాణాలు తీసిన ఈత సరదా.. ఎర్రకుంటలో నీటమునిగి ఆరుగురు మృతి

latest crime news in malkapuram in Hyderabad

latest crime news in malkapuram in Hyderabad

Crime News: హైదరాబాద్‌ నగర శివారులో విషాదం చోటు చేసుకుంది. జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మ‌ల్కారం గ్రామ ప‌రిధిలోని ఎర్ర‌కుంట చెరువులో ప‌డి 6మంది చ‌నిపోయారు.

వీరంతా జవహర్ నగర్లోని ఓ ఫంక్షన్ కు హాజరయ్యి ఆ తర్వాత సమీప ఎర్రగుంట చెరులో ఈతకు దిగారు. మొద‌ట ఐదుగురు విద్యార్థులు చెరువులో దిగి ఈత కొట్టేందుకు య‌త్నించి నీట మునిగారు. ఆ సమయంలో ఒడ్డున ఉన్న ఉపాధ్యాయుడు నీటిలో మునుగుతున్న విద్యార్థుల‌ను గ‌మ‌నించి వారిని కాపాడేందుకు చెరువులోకి దూకాడు. అయితే విద్యార్థుల‌ను కాపాడే క్ర‌మంలో టీచ‌ర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకుని స్థానికులు సహాయంతో మృత‌దేహాల‌ను వెలికితీశారు. చ‌నిపోయిన ఐదుగురు పిల్ల‌లూ 12 నుంచి 14 ఏళ్ల లోపు వారేన‌ని పోలీసులు తెలిపారు. మృతుల‌ను అంబ‌ర్‌పేట‌లోని మ‌ద‌ర్సా విద్యార్థులుగా గుర్తించారు. ఈ ఘటనతో విద్యార్థుల‌, ఉపాధ్యాయుడి కుటుంబాలు శోక‌సంద్రంలో మునిగిపోయాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మహిళల మృతి

Exit mobile version