Site icon Prime9

Zomato: ట్విట్టర్ చార్జీల్లో డిస్కౌంట్ లేదా మస్క్?.. జొమాటో క్రేజీ ట్వీట్

zomato tweet on blue tick charges issue

zomato tweet on blue tick charges issue

 Zomato: ఇటీవల కాలంలో సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్ ఫామ్ అయిన ట్విట్టర్ ను ఎలన్ మస్క్ సొంతం చేసుకున్న తర్వాత ఎన్నో మార్పులకు నాంది పలికారు. కాగా ఇటీవల ట్విట్టర్ బ్లూ టిక్ ఖాతాదారులకు సైతం నెలవారీ చార్జీలను కట్టాల్సిందేనని పేర్కొనింది. దీని కోసం ట్విట్టర్ యూజర్ల ప్రతి నెలా 8 డాలర్లు చెల్లించాలని లేదంటే బ్లూ టిక్ ను కోల్పోతారని ఆ సంస్థ కొత్త యజమాని మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఆసక్తిరక ట్వీట్ చేసింది.

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్ బుకింగ్ సేవల సంస్థ జొమాటో ట్విట్టర్ బ్లూటిక్ ఛార్జీలపై డిస్కౌంట్ ఇస్తే ఎలా ఉంటుంది అంటూ ఆసక్తికరంగా స్పందించింది. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట శరవేగంగా వైరల్ అవుతుంది. ‘ఓకే ఎలాన్, 8 డాలర్లలో 60 శాతం తగ్గింపు ఇస్తే ఎలా ఉంటుంది..? 5 డాలర్ల వరకు?’అని జొమాటో ఓ క్రేజీ ట్వీట్ చేసింది. ఇంకా దీనిపై మస్క్ స్పందించలేదు కానీ, జొమాటో మాత్రం ఈ విషయంపై మంచి చర్చకు తెరతీసిందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. క్రేజీ జొమాటో అంటూ ట్వీట్ చేస్తున్నారు.

జొమాటో చేసిన ఈ ట్వీట్ పై ఓ యూజర్‘TESLA లేదంటే doggy అనే కూపన్ కోడ్ అప్లయ్ చేయండి’ అంటూ చమత్కారంగా కామెంట్ చేశాడు. దీనికి మరో యూజర్ స్పందిస్తూ తప్పకుండా 60 శాతం డిస్కౌంట్ తర్వాత 3.2 డాలర్లు అవుతుంది. దీనికి 2.4 డాలర్లను ప్యాకేజింగ్ అండ్ హ్యాండ్లింగ్ చార్జీలు, డెలివరీ చార్జీల కింద మరో 2.4 డాలర్లను కలపండి. మొత్తం 8 డాలర్లు అవుతుంది. మీరు మా సేవను ఆనందించారని భావిస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశాడు. ఇంక ఈ విషయంపై మరో మహిళ ఇలా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను స్వేచ్ఛగా మాట్లాడే వేదికగా చేస్తానంటూ.. మాట్లాడేందుకు నెలకు 8 డాలర్లు అడుగుతున్నారని పేర్కొనింది.

ఇదీ చదవండి: యూజర్లకు షాక్.. నిలిచిపోయిన ట్విట్టర్ సేవలు

Exit mobile version