Twitter: డబ్బులు ఊరికే రావు అన్న మాటను ఇప్పుడు మస్క కూడా పాటిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇకపై ట్విట్టర్ లో బ్లూ టిక్ ఉచితం కాదు. బ్లూ టిక్ పొందడం కోసం నెలకు 8 డాలర్లు అనగా మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ.660 చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ కొత్త సీఈవో ఎలాన్ మస్క్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు.
ప్రపంచ కుబేరుడైన ఎలన్ మస్క్ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత అందులో కీలక మార్పులు చేపట్టారు. ముఖ్యంగా పలు కీలక బాధ్యతల్లో ఉన్న ఉద్యోగులను సంస్థ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే తాజాగా బ్లూ టిక్ పొందడానికి మరియు ఇప్పటికే ఉన్నదానిని నిలుపుకోవడానికి నెలకు సుమారు 8 డాలర్లు అనగా రూ. 660 చెల్లించాల్సి ఉంటుందని మస్క్ మంగళవారం ఓ ట్వీట్ ద్వారా ప్రకటించారు. కొనుగోలు శక్తి సమానత్వానికి, దేశానికి అనుగుణంగా ఈ ధరను సర్దుబాటు చేశామని ఆయన వెల్లడించారు. ట్విట్టర్లోని స్పామ్, స్కామ్‌ను ఓడించడానికి అవసరమైన ప్రత్యుత్తరాలు, ప్రస్తావనలు, శోధనలో కూడా బ్లూ టిక్ వినియోగదారులు ప్రాధాన్యతను పొందుతారని మస్క్ ప్రకటించారు. అలాగే వారు ఇకపై పెద్ద వీడియోను, ఆడియోను కూడా ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేయవచ్చని తెలిపారు. ‘‘మాతో కలిసి పనిచేయడానికి ఇష్టపడే ప్రచురణకర్తల కోసం పేవాల్ బైపాస్’’ కూడా ఉంటుందని మస్క్ తెలిపారు.
Twitter’s current lords & peasants system for who has or doesn’t have a blue checkmark is bullshit.
Power to the people! Blue for $8/month.
— Elon Musk (@elonmusk) November 1, 2022
ఇదిలా ఉండగా బ్లూ టిక్ వెరిఫై కోసం ఎంత చెల్లించవచ్చూ అంటూ ఓ కంపెనీ వారు ఒక పోల్‌ను ట్వీట్ చేశారు. దానిలో వినియోగదారులు ఎంత వరకు బ్లూ టిక్ కోసం చెల్లించడానికి సిద్దంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ పోల్ కు ఎలాన్ మాస్క్ ‘ఇంట్రెస్టింగ్’ అని సమాధానం ఇచ్చారు. దీనితో బ్లూ టిక్ కూ ఛార్జ్ చెయ్యనున్నారని తేలింది.
ఇదీ చదవండి: ట్విట్టర్ బోర్డ్ డైరెక్టర్లను తొలగించిన ఎలాన్ మస్క్