Site icon Prime9

YCP Leader Murder: వైకాపా అసమ్మతి నేత దారుణ హత్య.. వేటకొడవళ్లతో వెంటాడి మరీ..!

murder

murder

YCP Leader Murder: వైకాపా అసమ్మతి నేత దారుణ హత్యకు గురయ్యాడు. కళ్లల్లో కారం చల్లి 18 చోట్ల వేడకొడవళ్లతో అతి కిరాతకంగా నరికి చంపేశారు దుండగులు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో చోటుచేసుకుంది

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ వైకాపా అసమ్మతి నేత, మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి (46) శనివారం రాత్రి దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తుంది. పోలీసుల కథనం ప్రకారం రామకృష్ణారెడ్డి తన సొంత గ్రామమైన చౌళూరు సమీపంలో కర్ణాటక సరిహద్దులో దాబా నిర్వహిస్తున్నారు. కాగా శనివారం రాత్రి దాబా మూసివేసి, కారులో ఇంటికి వచ్చారు. అయితే రామకృష్ణ కారు దిగుతుండగా కాపు కాసిన దుండగులు ఆయనపై కారం పొడి చల్లి వేట కొడవళ్లతో 18 చోట్ల అతి దారుణంగా నరికారు. దానితో తీవ్రంగా గాయపడిన రామకృష్ణను స్థానికులు కారులో హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మరిణించినట్టు వైధ్యులు తెలిపారు. రామకృష్ణ మరణ వార్త తెలుసుకున్న వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆసుపత్రి వద్దకు తరలివచ్చారు.

రెండు ద్విచక్రవాహనాల్లో మాస్కులు ధరించిన అయిదుగురు దుండగులు వచ్చి రామకృష్ణపై దాడికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఎమ్మెల్సీ ఇక్బాల్‌, ఆయన పీఏ గోపీకృష్ణ, చౌళూరు రవికుమార్‌, హిందూపురం రూరల్‌ సీఐలే తన కుమారుణ్ని చంపేశారని రామకృష్ణారెడ్డి తల్లి లక్ష్మీనారాయణమ్మ ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్సీ పీఏపై ఇటీవల ఆయన పలు ఆరోపణలు చేయడం, గ్రామీణ మండల సీఐ జీటీ నాయుడుకి వ్యతిరేకంగా పైఅధికారుల ఫిర్యాదు చేశారని.. ఈ పాత కక్షల నేపథ్యంలోనే అతనిని ఆగంతుకులు చంపారని స్థానికులు అంటున్నారు. ఇదిలా ఉండగా ఆగస్టు 15న గ్రామంలో జెండా ఎగరేసే విషయంలోనూ ఎమ్మెల్సీ వర్గీయులకు, రామకృష్ణారెడ్డికి వివాదం జరిగిందని, రామకృష్ణను చంపుతామని కొందరు బెదిరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే హత్య జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: ప్రేమించడం లేదని యువతిని చంపేశాడు

Exit mobile version