Site icon Prime9

Tirupati Tiktok Couple Marriage: టిక్‌టాక్‌ ప్రేమకథా చిత్రం… భర్తకు ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య..!

Tirupati Tiktok Couple Marriage

Tirupati Tiktok Couple Marriage

Tirupati Tiktok Couple Marriage: నేటి సమాజంలోని పెళ్లికి ముందు ప్రేమలు కామన్ అయిపోయాయి. అయితే అది పెళ్లయిన తర్వాత బ్రేక్ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో పెళ్లైనాక కూడా చాటుమాటుగా ప్రేయసితో ప్రేమ వ్యవహారం నడిపిస్తుంటారు మరికొందరు. అయితే అది బయటపడిన రోజు భార్యలు చేసే గొడవ అంతా ఇంత కాదు. ఇంక భర్త వేరే వాళ్లతో చనువుగా ఉంటున్నాడంటేనే రచ్చరచ్చ చేసే భార్యలున్న నేటి కాలంలో ఓ ఆడపడుచు తన భర్త వేరే అమ్మాయిని ప్రేమించాడని తెలుసుకుని… భర్తకు ప్రేయసిని ఇచ్చి మరల పెళ్లిచేసింది ఈ భార్యామణి. ఇదెక్కడో వేరే దేశమో లేదా వేరే రాష్ట్రమో అని అనుకుంటే పొరపాటే. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ఘటన జరిగింది. ఆంధ్రా టెంపుల్ టైన్ గా ప్రసిద్ధి చెందిన తిరుపతి జిల్లాలోనే ఈ ఆశ్చర్యపరిచే సన్నివేశం జరిగింది.

తిరుపతి జిల్లా డక్కిలి మండలం అంబేద్కర్‌ నగర్‌కు చెందిన ఓ యువకుడు డిగ్రీ వరకు చదువుకున్నాడు. అతడు కొంతకాలంగా టిక్‌టాక్‌తో పాటూ మరికొన్ని యాప్‌లలో వీడియోలు చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి మొదట విశాఖకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడి… వారిద్దరి మనసులు కలిశాయి. ఒకర్ని ఒకరు ప్రేమించుకున్నారు. మరి ఏమైందో ఏమో కానీ కొద్ది రోజుల తర్వాత యువతి నుంచి యువకుడు దూరమయ్యాడు. సీన్ కట్ చేస్తే కొన్నిరోజులకు ఆ యువకుడికి టిక్‌టాక్‌లోనే కడపకు చెందిన మరో యువతితో పరిచయం ఏర్పడగా.. ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకుని హాయిగా ఉంటున్నారు.

సాఫీగా సాగుతున్న వీరి సంసార జీవితంలోకి ఒక్కసారిగా వైజాగ్ ప్రేయసి వచ్చిపడింది. ప్రియుడి కోసం కొన్నాళ్లు వేచిచూసిన విశాఖ యువతి నేరుగా తిరుపతికి వచ్చింది. ఆమె వచ్చి చూసేసరకి అప్పటికే తన ప్రియుడికి వేరే యువతితో పెళ్లైయిపోయిన సంగతి తెలిసి బాధపడింది. దానితో తిరుగు పయనం అవ్వకుండా… ఆ యువకుడి భార్యను కలిసి మాట్లాడింది. తానూ ఇక్కడే ఉంటానని.. అందరం కలిసి ఉందామని ఆమెకు విశాఖ యువతి నచ్చజెప్పింది. దానితో యువకుడి మొదటి భార్యకు ఏం చేయాలో అర్థంకాలేదు.. చివరకు ముగ్గురూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇంకేముంది కథ సుఖాంతం అయ్యేలా తన భర్తకు ప్రియురాలితో వివాహం చెయ్యడానికి భార్య సిద్ధమయ్యింది. భర్త ప్రియురాలితో పెళ్లిపీటలెక్కాడు భార్యే దగ్గరుండి మరీ ఆశీర్వదించి అక్షింతలు వేసింది.

ఇదీ చదవండి: CM Yogi Temple: సీఎం యోగి ఆదిత్యనాధ్ కు గుడి కట్టి పూజలు

Exit mobile version