Site icon Prime9

Sania Mirza: విడాకుల వివాదం.. “మీర్జా మాలిక్” ట్విస్ట్

sania-mirza-and-shoaib-malik-to-host-talk-show-together in urdu flex

sania-mirza-and-shoaib-malik-to-host-talk-show-together in urdu flex

Sania Mirza: భార‌త టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక్ విడాకులు తీసుకోనున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మాలిక్‌తో బ్రేక‌ప్ చెప్పేందుకు సానియా సిద్ధమైన‌ట్లు టాక్‌ వినిపించింది. ఈ స్టార్‌ జంట విడిపోయార‌ని, ఇద్దరూ ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారంటూ పాకిస్థాన్‌ మీడియా సైతం ప్రచారం చేసింది. వారిరువురి విడాకులకు ఓ పాకిస్థాన్‌ మోడల్‌ కారమంటూ కూడా అక్కడి మీడియా పేర్కొంది. అయితే ఈ వార్తలపై అటు మాలిక్‌ గానీ, ఇటు సానియా గానీ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే విడాకుల విషయంలో త్వరలోనే అధికారికంగా క్లారిటీ ఇవ్వబోతున్నారు అని టాక్‌ నడుస్తున్న తరుణంలో తాజాగా ఈ జంట అభిమానులకు షాకింగ్‌ ట్విస్ట్‌ ఇచ్చింది.

ఇద్దరూ కలిసి ఓ టాక్‌షో చేయనున్నారు. ప్రముఖ పాకిస్థానీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఉర్దూప్లెక్స్‌లో ‘మీర్జా మాలిక్’ అనే షోలో ఈ జంట కలిసి నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఉర్దూప్లెక్స్ అఫీషియల్ ఇన్ స్టా వేదికగా ఓ పోస్ట్ చేసింది. త్వరలోనే ఈ టాక్ షో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. దాయాదిదేశమైన పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను సానియా మీర్జా 2010లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు 2018లో ఓ కుమారుడు జన్మించి సంగితి తెలిసిందే.

ఇదీ చదవండి: ప్రతి కుక్కకీ ఓ రోజు వస్తుందంటే ఇదేనేమో.. కుక్కల కళ్యాణం

Exit mobile version