Site icon Prime9

Sajjala: ఆ వార్తలు అవాస్తం.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై సజ్జల కీలక వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy

sSajjala Ramakrishna Reddy

Sajjala: ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధమైందంటూ గత కొద్దిరోజులుగా పత్రికల్లో కథనాలు వెలువడుతున్న విషయం విదితమే. వైసీపీ ప్రభుత్వంపై విపక్ష నేతలు ఈ విషయమై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అంశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుండడంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్ గా రంగంలోకి దిగారు.

ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని సజ్జల స్పష్టం చేశారు. ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎవరినీ తొలగించబోవడంలేదని అన్నారు. పంచాయతీరాజ్ విభాగంలో కొందరు ఉద్యోగుల తొలగింపునకు అధికారులు ఆదేశాలు ఇవ్వగా, సీఎం జగన్ వారిపై మండిపడ్డారని సజ్జల వెల్లడించారు. ఆ ఆదేశాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారని సజ్జల వివరణ ఇచ్చారు. పంచాయతీ రాజ్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు వ్యవహారంపై విచారణ జరుగుతుందని పేర్కొన్నారు.

డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్న 17 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేటేసింది. పదేళ్లలోపు సర్వీసు ఉన్న వీరికి ఈ నెల 1న మెమో జారీ చేసింది. అలాగే, సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల వసతి గృహాల్లో పనిచేస్తున్న దాదాపు 350 మంది వంట కార్మికులు, కమాటీలు, సహాయకుల్ని తొలగిస్తూ నిన్న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనితో మిగతా విభాగాల్లోని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో వణుకు మొదలైంది.

ఇదీ చదవండి: పుంగనూరులో హై టెన్షన్.. పోలీసులపై చంద్రబాబు విమర్శలు

Exit mobile version