Jio 5G: భారత్ టెలికం మార్కెట్‌లో తక్కువ సమయంలోనూ ఎక్కువ మంది ఆదరణపొందిన జియో ఇప్పుడు 5జీలోనూ దూకుడు చూపిస్తోంది. ప్రస్తుతం జియో దేశంలోని నాలుగు సిటీల్లో ట్రయల్స్ కోసం 5జీ బీటా నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా 5జీ వినియోగదారులకు వెల్‌కమ్ ఆఫర్‌ను కూడా తీసుకొచ్చింది. అన్నీ ఉచితమంటూ, అన్ లిమిటెడ్ కాల్స్, డేటా అంటూ టెలికం మార్కెట్‌లో అడుగుపెట్టి సంచలనం సృష్టించిన ఆ సంస్థ.. ఇప్పుడు 5జీ విషయంలోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతోంది.
ప్రస్తుతం జియో 5జీ బీటా సర్వీస్‌లు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసిలో అందుబాటులోకి వచ్చాయి. విజయదశమి రోజున 5జీ సర్వీస్‌లను ప్రారంభించింది. మరో ఆసక్తికరమైన అంశమేంటంటే 5జీ సేవలు పొందాలంటే 5జీకి అప్‌గ్రేడ్ అయ్యేందుకు జియో యూజర్లు కొత్త సిమ్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఆ సంస్థ స్పష్టం చేసింది.
అంటే ఇప్పటికే వాడుతోన్న జియో సిమ్ 5జీకి కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే 5జీకి సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ మాత్రం ఉండాలని చెబుతున్నారు.
ఆ నాలుగు సిటీల్లో ఎంపిక చేసిన కస్టమర్లకు మెస్సేజ్ ద్వారా ఆహ్వానం పంపి వెల్‌కమ్ ఆఫర్‌ను జియో అందిస్తోంది. ఇలా మెస్సేజ్ ఆహ్వానాన్ని యాక్టివేట్ చేసుకున్నవారు మాత్రమే ఉచితంగా అన్‌లిమిటెడ్ డేటాను వాడుకునే వీలు ఉంటుందని వెల్లడించింది.
అయితే, రిలయన్స్ జియో 5జీ ప్లాన్‌లను ప్రకటించే వరకు ఈ వెల్‌కమ్ ప్లాన్ అందుబాటులో ఉండే అవకాశం ఉందని గత అనుభవాలను దృష్ట్యా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా 1జీబీపీఎస్ వరకు వేగం ఉంటుందని జియో చెబుతోంది. జియో యొక్క ట్రూ-5G “వి కేర్” సూత్రంపై నిర్మించబడింది.
ఇదీ చదవండి: ఎయిర్ టెల్ యూజర్లకు భారీ షాక్.. ఆ ఫోన్లకు 5జీ అందడం లేదు