Rain Alert: తెలంగాణకు మరోసారి రెయిన్ అలెర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. వర్షాలు ప్రజలను మరల ఇబ్బంది పెట్టనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వానల ధాటికి పలుచోట్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ తరుణంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా ఇప్పటికే రాజధాని నగరమంతా జలసంద్రాన్ని తలపిస్తుంది. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీనితో నగరవాసులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ముఖ్యంగా హయత్ నగర్, శేరిలింగంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సరూర్ నగర్, కాప్రా ప్రాంతాలు జలమయంగా మారాయి. కాగా గురువారం రోజు పలు ప్రాంతాల్లో పిడుగులు పడి నలుగురు చనిపోయారు.
ఇదీ చదవండి: మహేశ్ బాబు ఇంట్లో చోరీకి విఫలయత్నం..!