Prime9

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై కరెంట్ కట్.. ఇబ్బందులు పడిన భక్తులు

Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. కాగా నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజే భక్తులకు ఆలయంలో అసౌక్యం ఏర్పడింది. దుర్గగుడిలో కరెంట్ నిలిచిపోయింది. దాదాపు అరగంటకు పైగా కరెంట్ లేకపోవడం వల్ల భక్తులు, అర్చకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇకపోతే భవాని మాలలు వేసే ప్రాంగణం మొత్తం చీకటి కమ్ముకుని ఉంది. ఆలయ ప్రాంగణమంతా మారుమేగుతూ భక్తులకు సూచనలు చేసే మైకులు ఎక్కడికక్కడ పనిచేయకుండా పోయాయి. మైకులు ఆగిపోవడంతో సరైన సమాచారం అందక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇదిలా ఉంటే మరోవైపు అధికారుల మధ్య సమన్వయ లోపం తలెత్తింది. మొదటి రోజే దుర్గగుడి ఉద్యోగస్తులతో పోలీసుల వాగ్వాదానికి దిగారు. మహా మండపం వద్ద దుర్గగుడి సిబ్బందికి పార్కింగ్ లేదంటూ ద్విచక్ర వాహనాలపై మహా మండప ప్రవేశ ద్వారం గుండా వచ్చే దుర్గగుడి ఉద్యోగులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ తరుణంలో పోలీసులు, ఉద్యోగులకు మధ్య వాగ్వాదం జరిగింది.

ఇకపోతే నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారు స్వర్ణకవచలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఉదయం 3 గంటల నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు.

ఇదీ చూడండి: Bathukamma Immersion: బతుకమ్మను నిమజ్జనం ఎందుకు చేస్తారు.. దానివెనుకున్న రహస్యమేంటి..?

Exit mobile version
Skip to toolbar