Site icon Prime9

Phone Tapping: ఎంపీ రఘురామకృష్ణరాజు ఫోన్ ట్యాపింగ్ పై ఏపీ సర్కార్ కు నోటీసులు

phone tapping

phone tapping

Phone Tapping: తన ఫోన్ ట్యాప్ అవుతోందంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్ సభ స్పీకర్ కు చేసిన ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ కార్యాలయం స్పందించింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, సీఐడీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్‌పై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. తన ఫోన్లను ట్యాప్ చేస్తూ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. ఎంపీ రఘురామ ఫిర్యాదును కేంద్ర హోంశాఖ స్పీకర్‌ కార్యాలయం పంపింది. దర్యాప్తు చేసి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్ కార్యాలయం హోంశాఖను కోరింది. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.

తన రెండు సెల్ ఫోన్లు ట్యాపింగ్‌ చేసి వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగిస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈనెల 8న లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు ఫిర్యాదుచేశారు. ఎంపీ ఫిర్యాదుపై వివరాలు అందించాలని ఏపీ సీఎస్, డీజీపీకి నోటీసులు పంపారు. లోక్‌సభ అధికారులు. ప్రభుత్వం ఇచ్చే వివరణను ఫిర్యాదుదారుకు ఇచ్చేందుకు అంగీకరిస్తారో లేదో కూడా సమాధానం చెప్పాలని కోరింది.

 

Exit mobile version