Kerala Road accident: కేరళ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఢీ కొన్న ఘటనలో దాదాపు 9 మంది మృతి చెందగా మరో 35 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
కేరళలోని పాలక్కాడ్ నగరంలోని వడక్కంచెరి ప్రాంతంలో కేరళ ప్రభుత్వ బస్సును టూరిస్టు బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, మరో 35 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులెవరికీ ప్రాణాపాయం లేదని మంత్రి ఎంబీ రాజేష్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు, ముగ్గురు కేఎస్ఆర్టీసీ ప్రయాణీకులు మరణించినట్టు అధికారులు వెల్లడించారు. అయితే కేఎస్ఆర్టీసీ బస్సు కోయంబత్తూరు వైపు వెళుతుండగా ఈ టూరిస్ట్ బస్సు ఎర్నాకులం జిల్లా బసేలియోస్ విద్యానికేతన్ పాఠశాల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులతో తమిళనాడులోని ఊటీ వైపు వెళుతుండగా వడక్కంచెరి ప్రాంతంలో ఒకదానిని ఒకటి ఢీ కొనడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెప్తున్నారు.
కాగా ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని క్రేన్‌ల సహాయంతో రెస్క్యూ సిబ్బంది బస్సులోకి ప్రవేశించి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. అయితే మృతదేహాలకు గురువారం పోస్టుమార్టం నిర్వహిస్తామని కేరళ మంత్రి ఎంబీ రాజేష్ చెప్పారు.
ఇదీ చదవండి: దుర్గాదేవి విగ్రహాల నిమజ్జనంలో అపశ్రుతి.. 15 మంది మృతి