Site icon Prime9

Kakinada: తెదేపా సీనియర్ నేతపై హత్యాయత్నం

murder attempt on a tdp leader in kakinada

murder attempt on a tdp leader in kakinada

Kakinada: ఏపీ కాకినాడ జిల్లా తునిలో తెదేపా నాయకుడు, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగింది. భవాని మాల వేషధారణలో వచ్చిన దుండగుడు భిక్షాటన చేస్తున్నట్టుగా నటించి తన వద్దనున్న కత్తితో ఒక్కసారిగా శేషగిరిరావుపై దాడి చేశాడు. ఈ దాడిలో శేషగిరిరావు చేతికి, తలకు బలమైన గాయాలయ్యాయి.

ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అతన్ని కాకినాడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. దాడి అనంతరం నిందితుడు బైక్‌పై పరారయ్యాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న తుని పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శేషగిరిరావును పరామర్శించేందుకు తెదేపా సీనియర్‌ నేతలు యనమల, చినరాజప్ప తదితరులు ఆస్పత్రికి వెళ్లారు. శేషగిరిరావు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని తెదేపా నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదీ చదవండి: వైసీపీకి షాక్.. ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్

Exit mobile version