Site icon Prime9

Kakinada Crime: ప్రేమించడం లేదని యువతిని చంపేశాడు

father and son brutally murder in uppal

father and son brutally murder in uppal

Kakinada Crime: ప్రేమించమంటూ వెంటపడిన ఓ యువకుడు, తన ప్రేమను నిరాకరించిందని యువతిపై పగ పెంచుకుని ఆమెపై కత్తితో దాడి చేసి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కూరాడలో చోటుచేసుకుంది.

కాకినాడ రూరల్ పెదపూడి మండలంలోని కూరాడకు చెందిన ఓ యువతిని అదే గ్రామానికి చెందిన గుబ్బల వెంకట సూర్యనారాయణ తనను ప్రేమించాలంటూ కొంతకాలంగా వేధిస్తున్నాడు. తను అతని ప్రేమను నిరాకరించింది. ఈ క్రమంలో అతనిపై పగ పెంచుకున్న అతను శనివారం దారి కాసి కూరాడ నుంచి కాండ్రేగులకు స్కూటీపై వెళ్తున్న యువతిపై దాడి చేసి అనంతరం ఆమె పీక కోసి దారుణంగా చంపేశాడు. దానితో వెంటనే యువతి స్కూటీపై నుంచి కుప్పకూలింది. ఈ ఘటన చూసిన స్థానికులు వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. ప్రేమోన్మాదిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులుకు అప్పగించారు. కాగా తీవ్రంగా గాయపడిన ఆ యువతి అంబులెన్స్ వచ్చేసరికి ప్రాణాలు విడిచింది. సమాచారం మేరకు పెదపూడి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కాగా ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపింది.

ఇదీ చదవండి: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం 11 మంది సజీవదహనం

Exit mobile version