Site icon Prime9

Pawan Kalyan: విశాఖలో ఓవైపు వైసీపీ గర్జన.. మరోవైపు జనసేనాని పర్యటన

pawan-kalyan-visakha tour

pawan-kalyan-visakha tour

Pawan Kalyan: ఏపీ రాజకీయాలు విశాఖ కేంద్రంగా ఉట్టుడుకుతున్నాయి. ఓ వైపు అధికార వైసీపీ విశాఖ గర్జన ర్యాలీ నిర్వహిస్తుండగా మరోవైపు నేడు జనసేనాని విశాఖలో పర్యటించనున్నారు.

నేడు విశాఖ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పవన్ పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ రోజు 2గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కి పవన్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఎన్ఏడీ ఫ్లై ఓవర్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, తాటి చెట్లపాలెం, పార్క్ హోటల్, సిరిపురం సర్కిల్, బీచ్ రోడ్ మీదగా నోవాటెల్ హోటల్‌కి చేరుకోనున్నారు. ఇక సాయంత్రం విశాఖ జిల్లా పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమవ్వనున్నారు. ఆదివారం నాడు విశాఖలోని కళావాణి ఆడిటోరియంలో ఉత్తరాంధ్ర జనవాణి కార్యక్రమంలో జనసేనాని పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రజల నుంచి వాళ్ల సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను పవన్ స్వీకరించనున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇంక సోమవారం ఉదయం పవన్ ప్రెస్‌మీట్ నిర్వహించిన తర్వాత విజయనగరం పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.

ఈ సమావేశాల్లో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్ పార్టీ నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ చేపట్టిన విశాఖ గర్జన కార్యక్రమం సమయంలోనే పవన్ ఉత్తరాంధ్ర పర్యటన పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఇదిలా ఉంటే అంతకు ముందు విశాఖ గర్జన ఎందుకు అంటూ ట్విట్టర్ వేదికా వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ నిలదీశారు.

ఇదీ చదవండి: ఉప్పెనలా “విశాఖ గర్జన”.. వికేంద్రీకరణే లక్ష్యంగా..!

Exit mobile version