Site icon Prime9

Trains: ప్రయాణికులకు షాక్.. నేడు 163 రైళ్లు రద్దు

railways-removed-non-performer-employees every three days

railways-removed-non-performer-employees every three days

Trains: భారతీయ రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా భారీసంఖ్యలో రైళ్లను రద్దుచేసింది. మెయింటేనెన్స్‌, మౌలికవసతుల కల్పననుగాను మొత్తం 163 రైళ్లను క్యాన్సల్‌ నేడు క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించింది.

భారీతీయ రైల్వే వ్యవస్థ దేశవ్యాప్తంగా 163 రైళ్లను నేడు రద్దు చేసింది. ఇందులో 115 రైళ్లను పూర్తిగా రద్దుచేస్తున్నామని, మరో 48 రైలు సర్వీసులను పాక్షికంగా రద్దు చేస్తున్నామని తెలిపింది. కేవలం సోమవారం (అక్టోబర్‌ 10) ఒక్కరోజు మాత్రమేనని ఈ రద్దు ఉంటుందని, దీనిపై తదుపరి సమాచారం త్వరలోనే అధికారులు ప్రకటిస్తారని వెల్లడించింది. ఈ రైళ్లకు సంబంధించి ముందుగానే బుక్‌చేసుకున్న టికెట్లను రద్దుచేస్తున్నామని ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. కౌంటర్లలో టికెట్లు కొనుగోలుచేసినవారు అధికారులను సంప్రదించాలని తెలిపింది.

మరోవైపు ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను సైతం నడుపనుంది. వీటిలో పలు సింగిల్‌ వే రైళ్లూ ఉన్నాయి. సికింద్రాబాద్-యశ్వంపూర్, పూర్ణా-తిరుపతి, అలాగే ఈ నెల 12న నర్సాపూర్‌-తిరుపతి, విజయవాడ-ధర్మవరం మధ్య సింగిల్‌ వే స్పెషల్‌ రైళ్లను నడుపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది.

ఇదీ చదవండి: ఇకపై ఢిల్లీలో హోటళ్లు, రెస్టారెంట్లు 24×7 వ్యాపారం చేసుకోవచ్చు.

 

Exit mobile version