Site icon Prime9

HCU Students Protest: హైదరాబాద్ సెంట్రలో యూనివర్సిటీలో ఉద్రిక్తత.. విద్యార్థులపై దాడులు

hcu students protest

hcu students protest

HCU Students Protest: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ అట్టుడుకుతుంది. వర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. విద్యార్థుల ఆందోళనను అణచివేయడానికి యూనివర్శిటీ సెక్యూరిటీ సిబ్బంది వారిపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

హైదారాబాద్ సెట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనింది. విద్యార్థుల ఆందోళనతో విశ్వవిద్యాలయం మారుమోగుతుంది. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫై అయిన విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించకపోవడం వల్ల ఆగ్రహించిన విద్యార్థులు వర్సిటీలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. అయితే ధర్నాను బలవంతంగా విరమించేసేందుకు విశ్వవిద్యాలయ సెక్యూరిటీ సిబ్బంది ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది దాడిలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
ఈ ఘటన తర్వాత విద్యార్థులు తమ ఆందోళన మరింత తీవ్ర తరం చేశారు.

దేశ వ్యాప్తంగా సెంట్రల్ యూనివర్శిటీల్లో చదువుతున్న లక్షా 57 వేల మంది విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేశారని వాటిని తిరిగి ఇచ్చేంత వరకు తాము ఆందోళనను విరమించేది లేదని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: Pavan Kalyan: జర్నలిస్టుల అరెస్టులు ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనం.. పవన్ కళ్యాణ్

Exit mobile version