Site icon Prime9

Bihar Crime: కూరలో ఉప్ప తక్కువైందని కట్టుకున్న భార్యను కడతేర్చాడు..!

husband killed wife due to salt less in curry

husband killed wife due to salt less in curry

Bihar Crime: ఎవరైనా కూరలో ఉప్పు తక్కువైతే కాస్త ఉప్ప వేసుకుని తింటారు. లేదా ఇంకేం వేసుకుంటాములే అని సర్దుకుపోయి తింటారు. మహా అంటే వంట చేసిన భార్యని నాలుగు మాటలంటారు. కానీ ఈ ప్రబుద్ధుడు మాత్రం కూరలో ఉప్పచాలలేదని కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఈ దారుణ ఘటన బిహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

బిహార్ రాష్ట్రంలోని కలాన్ గ్రామానికి చెందిన ప్రభురాం అనే వ్యక్తి భోజనం తినడానికి వచ్చాడు. అతని భార్య వంట అంతారెడీ చేసి ప్లేట్లో వడ్డించింది. కాగా కూరచేసే క్రమంలో ఆరోగ్య దృష్ట్యా కూరలో కాస్త ఉప్ప తగ్గించి వంట చేసింది. అయితే కూరలో కాస్త ఉప్ప తక్కువైందని భార్యపై ప్రభురాం ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారిద్దరి మధ్య మాటామాట పెరిగింది. అది కాస్త చిలికిచిలికి గాలివానల మారింది. కోపం రగిలిపోయిన ప్రభురాం కట్టుకున్న భార్యను కత్తితో పొడిచి చంపేశాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రభురాంను అరెస్ట్ చేశారు.

ఇదీ చదవండి: హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర.. పోలీసుల ఎంట్రీతో..!

Exit mobile version