Site icon Prime9

East Godavari: వింత ఘటన.. కళ్ళు తెరిచిన లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం

godess-lakshmi-devi-idol-open-its-eyes-in-kadiyapulanka-east-godavari

godess-lakshmi-devi-idol-open-its-eyes-in-kadiyapulanka-east-godavari

East Godavari: ఆచార సంప్రదాయాలకు సనాతన హిందూధర్మానికి పెట్టింది పేరు భారతదేశం. ఇక్కడ దేవుళ్ళనే కాదు ప్రకృతిలోని పశుపక్షాదులు, చెట్లు, చేమలను కూడా అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే సంప్రదాయం ఉంది. అలాంటి హిందుధర్మంలో దేవుళ్ళకు మహిమలున్నాయని భావిస్తారు భక్తులు. అందుకు ఉదాహరణగా వినాయకుడు పాలు తాగడం, పాము శివుడికి పూజ చేయడం. ఆవు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వంటి అనేక ఘటనలను రుజువుగా చూపిస్తారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిలాల్లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది.

కడియపులంకలో ఉన్న ఓ మహాలక్ష్మి గుడిలో లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కళ్లు పెద్దవిచేసి చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాగా ఈ వార్త క్షణాల్లోనే సమీప ప్రాంతాలకు విస్తరించింది. దానితో చుట్టుపక్కల ప్రజలు అమ్మవారిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అమ్మవారు మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కళ్లు పెద్దవి చేసి చూశారంటూ ఓ భక్తురాలు చెప్పింది. దీంతో అమ్మవారిని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎప్పటినుంచో తాము అమ్మవారికి పూజలు చేస్తున్నామని కానీ అమ్మవారు ఇలా కళ్లు తెరిచి చూడడం ఇదే మొదటిసారి అంటూ కొందరు భక్తులు తెలిపారు. ఇలా ఈ ఘటన స్థానికంగా వైరల్ అయింది.

ఇదీ చదవండి: ఎస్వీబీసీ సలహాదారుగా సింగర్ మంగ్లీ

Exit mobile version