Site icon Prime9

Ghulam Nabi Azad: డెమొక్రటిక్ “ఆజాద్” పార్టీ

ghulam nabi azad new party

ghulam nabi azad new party

Ghulam Nabi Azad: దేశంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్బవించింది. కాంగ్రెస్‌కు వీడ్కోలు పలికిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సొంత పార్టీని స్థాపించారు. తన రాజకీయ పార్టీ పేరును ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ’గా ప్రకటించారు.

నీలం, తెలుపు, పసుపు రంగులతో కూడిన జెండాను ఆవిష్కరించారు. మూడు రంగులు నిలువుగా ఉన్న ఆ జెండాలో మొదటి రంగు నీలం, మధ్యలో తెలుపు రంగు, మూడో రంగు పసుపుగా ఉన్నాయి. తన పార్టీ జెండాను అలానే తయారు చెయ్యడానికి గల కారణాన్ని కూడా ఆజాద్ వివరించారు. పసుపు రంగు కొత్తదనానికి, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని, తెలుపు శాంతికి చిహ్నమని, నీలం స్వేచ్ఛకు, సంద్రంలోని లోతుకు, అందనంత ఎత్తులో ఉండే ఆకాశ వర్ణానికి చిహ్నమని ఆయన తెలిపారు.

ఇకపోతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికల ముందు సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అయిన గులాం నబీ ఆజాద్‌ ఆ పార్టీతో 52 ఏళ్ల సుదీర్ఘ బంధాన్ని తెంచుకున్న సంగతి విదితమే. ఆయన పార్టీకి రాజీనామా చేస్తూ రాహుల్ గాంధీపై విమర్శనాస్త్రాలు సంధించడమూ చూశాం.

ఇదీ చదవండి:రాజస్థాన్ లో రాజకీయ రచ్చ.. సీఎంగా పైలట్ వద్దంటూ రాజీనామాలు

Exit mobile version