Site icon Prime9

Swimming Deaths: ఈత సరదా.. నలుగురు చిన్నారులు మృతి

yacharam crime news 4 children dead

yacharam crime news 4 children dead

Swimming Deaths: ఈత సరదా ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని తాడిపర్తి గ్రామంలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మరణించారు.

దసరా సెలవులు కావడం వల్ల రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన ఓ నలుగురు పిల్లలు వాళ్ల బంధువుతో కలిసి గొల్లగూడలోని దర్గాకు వెళ్లారు. కాగా ప్రార్థనలు పూర్తయిన తర్వాత ఆ నలుగురు పిల్లలు సమీపంలోని చెరువులో దిగి సరదాగా ఆడుకోవాలని చూశారు. కానీ అనుకోని రీతిలో చెరువులో మునిగి మరణించారు. కాగా విషయం తెలుసుకున్న గ్రామస్తులు చెరువులోకి దిగి మృతదేహాలను బయటకు తీశారు. మృతులను సమరిన్(14), ఖలేదు(12) రెహాన (10), ఇమ్రాన్ (9) లుగా పోలీసులు గుర్తించారు.

కాగా వీరంతా రెండు కుటుంబాలకు చెందిన నలుగురు పిల్లలు. దర్గాకు వెళ్లి తిరిగివస్తారనుకున్న పిల్లలు శవాలై తిరిగి రావడాన్ని చూసి చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం మృతదేహాలను ఓజీహెచ్ మార్చురీకి తరలించారు.

ఇదీ చదవండి: మరో ప్రాణం తీసిన లోన్ యాప్స్

Exit mobile version