Site icon Prime9

Dalit Student Dead: పరీక్షలో తప్పు రాశాడని.. విద్యార్థిని కొట్టి చంపిన టీచర్

dalit student dead after beaten teacher in auriaya

dalit student dead after beaten teacher in auriaya

Dalit Student Dead: పరీక్షలో ఒక పదం తప్పు రాయడం వల్ల ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. పదం తప్పరాస్తావా అంటూ ఒక దళిత విద్యార్థిని టీచర్ విచక్షణారహితంగా చితకబాదడం వల్ల తీవ్ర గాయాలపాలైన ఆ విద్యార్థి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్‭లోని ఇటావా జిల్లా ఔరియాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే నిఖిల్ డోహ్రే 10వ తరగతి చదువుతున్నాడు. కాగా పరీక్షలో ఒక పదం తప్పు రాసినందుకు సెప్టెంబర్ 7న సోషల్ సైన్స్ టీచర్ అశ్విని సింగ్, నిఖిల్ ను విచక్షణారహింతగా చితకబాదాడు. దీనితో ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వారి తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయమై సెప్టెంబర్ 24న నిఖిల్ తండ్రి రాజు డోహ్రె అచ్చలద్ పోలీసు స్టేషన్‭లో ఫిర్యాదు చేశాడు. కాగా బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఆధిపత్య కులానికి చెందిన అశ్విని సింగ్ అనే టీచర్ కులం పేరుతో తరగతి గదిలో నిఖిల్‭ను తిట్టాడని, కులం ఆధారంగానే తన కొడుకును కర్రలతో, రాడ్డుతో కొట్టాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడి తండ్రి రాజు పేర్కొన్నాడు.

ఈ విషయమై ఇటావా సీఎంఓతో మాట్లాడామని, కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నామని, నిజానిజాల్ని బట్టి చర్యలు తీసుకుంటామని ఔరియా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ చారు నిగమ్ తెలిపారు.

ఇదీ చదవండి: లోయలో పడిన టెంపో.. 7 మంది మృతి

Exit mobile version