Site icon Prime9

PawanKalyan: జనసేనానితో చంద్రబాబు భేటీ

chandrababu pawan meet

chandrababu pawan meet

Mangalagiri: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. విజయవాడ నోవాటెల్‌లో పవన్‌ను చంద్రబాబు కలిశారు. విశాఖ ఘటనపై ఆరా తీశారు. జనసైనికుల అక్రమ అరెస్టులను చంద్రబాబు ఖండించారు. రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇరువురూ ఉమ్మడి కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read Also: Pawan Kalyan: ఇక యుద్ధమే.. కరాళధ్వనుల నడుమ సిద్ధమేనన్న జనసేన సైనికులు

విశాఖపట్నం పర్యటనలో పవన్ కళ్యాణ్ ను ఆంక్షలపేరిట హోటల్ నుంచి బయటకు వెళ్లకుండా నిరోధించిన విషయం తెలిసిందే. అపుడు కూడ చంద్రబాబు పవన్ కు పోన్ చేసి మాట్లాడారు. జనసైనికులపై కేసులు పెట్టడాన్ని కూడ ఖండించారు. నారా లోకేష్ కూడ జనసైనికులపై కేసులు పెట్టడాన్ని ఖండించారు. పవన్ కళ్యాణ్ సోమవారం విజయవాడ వచ్చినపుడు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వచ్చి పవన్ కు సంఘీభావాన్ని ప్రకటించారు. మొత్తంమీద వైజాగ్ ఘటనతో ఏపీలో ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిమీదకు వస్తున్నాయి.

Exit mobile version