Site icon Prime9

Alia Bhatt: ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆలియా.. ఆనందంలో కపూర్ కుటుంబం

alia gave birth to a baby girl

alia gave birth to a baby girl

Alia Bhatt: బాలీవుడ్ క్యూట్ కపుల్ ఆలియా భట్, రణబీర్ కపూర్ దంపతులకు కూతురు పుట్టింది. ముంబైలోని ప్రముఖ ఆసుపత్రి అయిన రిలయన్స్ ఫౌండేషన్ హాస్పటల్ లో ఆమెకు డెలివరీ జరిగింది.

పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో ఆలియాకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగానే ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా ఆలియా రణబీర్ కపూర్ల వివాహం ఈ ఏడాది ఏప్రిల్ 14న ఘనంగా జరిగింది. వివాహం తర్వాత వీరిద్దరూ జంటగా “బ్రహ్మాస్త్ర” చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా ఆ మధ్యకాలంలో తాను తల్లి కాబోతున్న విషయాన్ని చెకప్ చేయించుకున్న తర్వాత హాస్పిటల్ బెడ్ పైనుంచి ఆలియా తన ఫ్యాన్స్ కి నెట్టింట తెలియజేసిన విషయం విదితమే. ఇక బ్రహ్మాస్త్ర చిత్ర ప్రమోషన్లలో సైతం ఆలియా తన భర్తతో కలిసి పాల్గొంది. అయితే ఈ ప్రమోషన్స్ లో తను బేబీ బంప్ తో తిరుగుతూ హల్చల్ చేసింది. కాగా తాజాగా నేడు ఉదయం ఆలియా భర్త రణబీర్ తో  కలిసి డెలివరీ కోసం రిలయన్స్ ఆసుపత్రికి వెళ్లింది.

ఇదీ చదవండి: నా గురించి రాసే దమ్ము ఎవరికి ఉంది- అఫైర్స్ పై బాలకృష్ణ ఊరమాస్ ఆన్సర్

Exit mobile version