Nine Years Girl Rape: దేశంలో రోజురోజుకి మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్ద తేడాలేకుండా పసికందు నుంచి పండు ముసలివాళ్లను సైతం మృగాళ్లు విడిచిపెట్టడం లేదు. మనిషి అని మర్చిపోయిన కామాంధుల కీచక కార్యకలాపాలకు చిన్న పిల్లలు బలైపోతున్నారు. ఈ క్రమంలోనే తొమ్మిదేళ్ల బాలికపై ఓ కీచకుడు పేట్రేగిపోయాడు. చిన్నపిల్ల అని కూడా చూడకుండా ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తాజాగా రంగారెడ్డి జిల్లాలో జరిగింది.
రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్పల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న బీహార్‌కి చెందిన దేవదాస్ అనే యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు.
కాగా బాలిక గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు గమనించిన తల్లీదండ్రులు బాలికను ఆరాతీయగా ఏడుస్తూ అసలు విషయం చెప్పింది.
తల్లిదండ్రులు ఓ పరిశ్రమలో పనికి వెళ్లిన సమయంలో ఇంటి పక్కనే ఉన్న దేవదాస్ తరచూ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టు బాలిక తల్లిదండ్రులకు వివరించింది.
ఈ విషయమై వారు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు యువకుడుని అదుపులోనికి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
ఇదీ చదవండి: Viral News: ఏడాదిన్నరగా ఇంట్లోనే డెడ్ బాడీ.. తీరా చూస్తే ఘోరం..!