Site icon Prime9

Delhi Crime: ఢిల్లీలో ఘోరం.. శివుడి ఆజ్ఞ అంటూ చిన్నారి హత్య

occult worship in Hyderabad

occult worship in Hyderabad

Delhi Crime: టెక్నాలజీ పరంగా ఎంతగా ఎదిగినా మనిషి మూఢనమ్మకాలను విశ్వసిస్తూనే ఉన్నాడు. శివుడి ఆజ్ఞ అంటూ ఓ చిన్నారిని ఇద్దరు దుర్మార్గులు బలితీసుకున్నారు. ఈ అమానవీయ దారుణ ఘటన ఢిల్లీలోని లోధిలో చోటుచేసుకుంది.

దక్షిణ ఢిల్లీలోని లోధి కాలనీలోని దారుణం జరిగింది. సీజీవో కాంప్లెక్స్‌లో నిర్మాణంలో ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ప్రధాన కార్యాలయం ఆవరణలో నరబలి పేరిట 6 ఏళ్ల బాలుడు హత్యకు గురయ్యాడు. శివుడి ప్రసాదంగా అని పిలిచే గంజాను తాగి ఇద్దరు దుర్మార్గులు శనివారం అర్థరాత్రి వేళ ధర్మేంద్ర అనే చిన్నారి గొంతు కోశారు. తమ జీవితంలో మోక్షం పొందేందుకే ఇలా చిన్నారిని బలితీసుకున్నామని నిందితులు పోలీసుల వద్ద ఒప్పుకున్నారు. కాగా నిందితులు ఇద్దరినీ బీహార్‌కు చెందిన విజయ్‌కుమార్‌, అమర్‌కుమార్‌గా పోలీసులు గుర్తించారు. వీరిరువురూ చనిపోయిన చిన్నారి తల్లిదండ్రులతో కలిసి నిర్మాణ స్థలంలో సిమెంట్ కట్టర్లుగా పనిచేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే శనివారం రాత్రి భోజనానికి ముందు తాము భజన చేసుకుంటూ ఉండగా తమ పెద్దకుమారుడైన ధర్మేంద్ర కనిపించకుండా పోయాడని, అతనిని వెతుకున్న క్రమంలో రక్తపు మరకలు కనిపించాయని వెళ్లి చూడగా అక్కడ తన కుమారుడు తల మొండెం వేరుచేయబడి ఉన్నాడని కన్నీరుమున్నీరుగా మృతుడి తండ్రి విలపించాడు. కాగా అక్కడే బిహారీ కార్మికుల చేతిలో కత్తి రక్తంతో కనిపించిందని వెంటనే పోలీసులుకు సమాచారం అందిచామని స్థానికులు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. కాగా విచారణలో శివుడు కలలో కనిపించి ఓ పిల్లాడిని బలివ్వమని అడిగాడని అదే సమయంలో ధర్మేంద్ర అటుగా వెళ్తూ కనిపించాడని అతనని నిర్మాణస్థలంలోనే ఓ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి తలకు గాయం చేసి నరబలి ఇచ్చామని విజయ్ కుమార్ ఒప్పుకున్నాడని
డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) సౌత్, చందన్ చౌదరి తెలిపారు.

ఇదీ చదవండి: నవరాత్రి ఉత్సవాల్లో విషాదం.. డాన్స్ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి

Exit mobile version