Site icon Prime9

5G Network: 5జీ సేవలు వచ్చేశాయ్.. తెలుగురాష్ట్రాల్లో ఎప్పుడంటే..?

5G launch in india

5G launch in india

5G Network: దేశంలో నేటి నుంచి 5జీ సేవ‌లు మొద‌ల‌య్యాయి. ఢిల్లీలో జ‌రుగుతున్న‌ ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సేవ‌ల‌ను లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ ఐఎంసీ సమావేశం ఈనెల 4వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ సమావేశాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం (డాట్), సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) కలసి నిర్వహిస్తున్నాయి.

రిలయన్స్ జియో, ఎయిర్‌‌‌‌‌‌‌ టెల్, వీఐ ద్వారా 5జీ సేవలు ఢిల్లీ, ముంబైతో సహా ఏడు నగరాల్లో ముందుగా అందుబాటులోకి తెస్తామని ఇప్పటికే అధికారులు తెలిపారు. కాగా ఇందుకు కొంత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో 5జీ సేవలను దశలవారీగా అందించనున్నట్టు ప్రకటించింది. వచ్చే దీపావళి నాటికి ఢిల్లీ, కోల్‌క‌తా, చెన్నై, ముంబైలో జియో 5జీ సేవలను ప్రారంభించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. అంటే ఈ నెల‌ఖ‌రులోగా ఈ నాలుగు న‌గరాల్లో 5జీ నెట్‌వ‌ర్క్ అందుబాటులోకి వ‌స్తుంది.

ఇంక దేశంలోని ఇత‌ర ప్రాంతాలకు ఈ సేవలు పొందాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాబ‌ట్టి 5జీ సేవ‌లు ఈ రోజే నుంచే మొద‌లైనా దానిని అంద‌రూ ఉప‌యోగించడం కుద‌ర‌దు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే 5జీ ఇప్పుడే మొద‌ల‌య్యే అవ‌కాశం లేదు. ఢిల్లీ విమానాశ్రయం మూడో టెర్మినల్‌లో ఇప్పుడు సేవలకు 5జీ సేవలు సిద్ధంగా ఉన్నాయి. అక్క‌డి ప్రయాణికులు 20 రెట్ల వేగవంతమైన కనెక్టివిటీని పొందుతారు.

ఇదీ చదవండి: పండుగ వేళ సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గిన సిలిండర్ ధరలు

Exit mobile version