Prime9

Pawan Kalyan: ఫ్యూడలిస్టిక్ కోటల్ని బద్దలు కొట్టక తప్పదు.. పవన్ కళ్యాణ్

Andhra Pradesh: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్లో ఓ వీడియో పోస్టు చేశారు. ఫ్యూడలిస్టిక్ కోటల్ని బద్దలు కొట్టక తప్పదు అంటూ సాగిన ఈ వీడియోలో పవన్ ఇలా అన్నారు. “మనల్ని పరిపాలించిన రవి అస్తమించని బ్రిటీష్ దేశానికి భారతీయ సంతతికి చెందిన రుషి సునాక్ ప్రధాన మంత్రి అవగలిగే పరిస్థితులు ఉన్నప్పుడు, ఏపీలో ఇంకా ఫ్యూడలిస్టిక్ మనస్తత్వం ఉన్న వ్యక్తులు మిగతా వాళ్లను ఎందుకు రానివ్వరు? ఎంత కాలం రానివ్వకుండా ఉంటారు.

భారత దేశం స్వతంత్రం సంపాదించుకుని మనం చేసిన అద్భుతం ఏంటంటే పంచాయతీ ఎన్నికల్లో అణగారిన వర్గానికి చెందిన ఒకరు స్వేచ్ఛగా నేను నామినేషన్ వేద్దాం ఓట్లు వచ్చినా రాకున్నా అనుకొనే పరిస్థితి లేదు. దీని గురించి ఏమనాలి? బ్రిటీష్ వాడు వదిలి వెళ్లిపోయినా ఇంకా ఊడిగం ఎవరికి చేస్తాం. నామినేషన్ వేసే అర్హత కూడా నీకు లేదని భయపెట్టేస్తుంటే దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి. ఫ్యూడలిస్టిక్ కోటల్ని బద్దలు కొట్టక తప్పదు. ఏ రోజా అని ఎదురుచూస్తున్నా” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ కార్యక్రమంలో ఇళ్లను కొల్పోయిన వారికి పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. రెండురోజులకిందట గ్రామంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ బాధితులను పరామర్శించి ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. అంతేకాదు మొత్తం 53 ఇళ్ల బాధితులకు లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.53 లక్షల ఆర్దికసాయాన్ని ప్రకటించారు.

Exit mobile version
Skip to toolbar