Site icon Prime9

Viral Video: లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన ఎస్సై.. ఆధారాలు లేకుండా నోట్ల కట్టలు నోట్లో కుక్కుకుని..!

viral-video-faridabad-SI-caught-bribe-case-tries-swallow-cash in haryana state

viral-video-faridabad-SI-caught-bribe-case-tries-swallow-cash in Haryana state

Viral Video: ప్రస్తుత కాలంలో ఏ చిన్న పని జరగాలన్నా అడ్డదారిలో వెళ్లాల్సిందే. నీతి నిజాయితీగా పనులు జరిగే సందర్భంగాలు చాలా తక్కువనే చెప్పాలి. చెయ్యి తడిపితే కానీ పెన్ను కదలడం లేదు, ఫైలు రావడం లేదు. ఇవేవి డైలాగ్స్ కాదండోయ్ నేటి సమాజంలో జరుగుతున్న విపరీతాలు. లంచం ఇవ్వనిదే ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ప్రైవేటు రంగంలో గానీ ఏ చిన్న పని కూడా జరగడం లేదు. ఆ లంచం వందలే అవ్వచ్చు కోట్లే  అవ్వచ్చు ఒక్కొక్క అధికారి ఒక్కో విధంగా వారివారి డిమాండ్లను వెల్లబుచ్చుతుంటారు. ఇదిలా ఉంటే ఈ లంచం ఇవ్వలేని కొందరు బాధితులు తమకు అండగా ఉంటారని పోలీసులను ఆశ్రయిస్తే.. ఆఖరికి వాళ్లు కూడా అంతో ఇంతో ఇవ్వాళని అడిగితే ఇక సామాన్యుల మొర ఆలకించేవారు వారెవరుంటారు.. ఇలాంటి ఓ ఘటనే తాజాగా హర్యానా రాష్ట్రంలో చోటుచేసుకుంది.

గేదె పోయిందంటే.. రూ. 10 వేలు ఇవ్వమ్మన్నాడు..

గేదె పోయింది సారూ అంటూ ఎస్సైని ఆశ్రయిస్తే పదివేలు ఇచ్చుకో పని జరుగుతుంది అన్నాడు ఆ ప్రభుత్వ ఉద్యోగి. దానితో కొంత డబ్బు అప్పుడు ఇచ్చి.. పని అయ్యిన తర్వాత మొత్తం ఇచ్చేస్తానని ఆ బాధితుడు పేర్కొన్నాడు. ఇక మొత్తం డబ్బు ఇచ్చే సమయంలో సరిగ్గా ఈ అవినీతిపరుడి ఆటకట్టించేందుకు మేమున్నామంటూ విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఇంకేముంది డబ్బు దొరికితే ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే అన్నట్టు ఉద్యోగంతో పాటు ఉన్న డబ్బంతా అధికారులు స్వాధీనం చేసుకుంటారని భావించిన ఆ ఎస్సై ఏం చేశాడో ఈ వీడియోలో మీరే చూడండి..

రూ. 6వేలతో పని కాదని..

హర్యానాలోని ఫరీదాబాద్‌లో సుభ్నత్ అనే రైతు గేదెను ఎవరో దొంగిలించారు. దానితో ఆయన పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. కేసు నమోదు చేసి తనకు న్యాయం చెయ్యాలంటూ ఎస్సై మహేంద్రను ఆ రైతు కోరాడు. దానికి ఆ ఎస్సై రూ. 10 వేలు ఇస్తేనే నీ కేసును నేను టేకప్ చేస్తానంటూ డిమాండ్ చేశాడు. దానితో సుభ్నత్ రూ. 6 వేలు అప్పటికప్పుడే సమర్పించుకున్నాడు. మిగతా నాలుగు వేలు కూడా ఇస్తేనే కేసు సంగతి చూస్తానని ఎస్సై తేల్చి చెప్పాడు. దానితో ఆ బాధితుడు మిగతా రూ. 4 వేలు తర్వాత ఇస్తానని ఇప్పుడు తన దగ్గర లేవని ఎస్సై మహేంద్రను కాళ్లావేళ్ల పడి వేడుకున్నాడు.

నోట్లో నోట్ల కట్టలు..
అయినా ససేమిరా అంటూ మిగిలిన నాలుగు వేలు కూడా తెచ్చి ఇస్తేనే పనిచేస్తానంటూ ఎస్సై అన్నాడు. దానితో చేసేదేమీ లేక మిగిలిన రూ. 4వేల కూడా తెచ్చి ఇవ్వబోయాడు. సరిగ్గా ఇదే సమయంలో విజిలెన్స్ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. దానితో ఒక్క క్షణం షాకైన ఎస్సై డబ్బు దొరికితే ఎక్కడ తన ఉద్యోగానికి ఎసరు వస్తుందో అని భావించి ఆధారాలు లేకుండా చేసేందుకు నోట్ల కట్టలను నోట్లో కుక్కుకున్నాడు. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఎస్సై మహేంద్ర నోట్లో వేళ్లు పెట్టి తీసుకున్న లంచం డబ్బునంతా కక్కించేశారు విజిలెన్స్ అధికారులు.
ఎస్సైపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://youtu.be/OraB0q6hrfE

ఇదీ చదవండి: టీటీడీ ఈవో ధర్మారెడ్డికి నెలరోజులు జైలు శిక్ష, వెయ్యిరూపాయల జరిమానా

Exit mobile version