Site icon Prime9

Viral Video: రైలు కింద పడినా బతికేశాడు.. అదృష్టం అంటే ఇదినేమో..!

man-tries-cross-track-under-parked-train viral video in bihar

man-tries-cross-track-under-parked-train viral video in bihar

Viral Video: చచ్చి బతికాడురా, అదృష్టం అంటే ఇదేరా అనే పదాలను కొన్ని సార్లు కొంత మందిని చూస్తే నిజమే అనిపిస్తుంది. బీహార్లో భాగల్ పూర్లో జరిగిన ఈ ఘటన చూస్తే మీరు ఇలానే అనకమానరు. మరెందుకు ఆలస్యం ఈ వీడియో చూసెయ్యండి. ప్రజలు ఉరుకుల పరుగులు జీవితంతో హడావిడిగా ఉంటున్నారు. నిబంధనలు గాలికొదిలేసి మరీ పరుగులు పెడుతుంటారు. 5 నిమిషాలు ఆదా చేయడానికి ప్రాణాలమీదకు తెచ్చుకుంటుంటారు. జీబ్రాక్రాసింగ్ పక్కనపెట్టి ఫుట్ ఓవర్ బ్రిడ్జిలకు బదులుగా రోడ్డు దాటడం, సిగ్నల్స్ అయినా, రైల్వే క్రాసింగులైనా సరే ఏదీ పట్టించుకోకుండా వాటిని దాటేందుకు ప్రయత్నిస్తుంటారు. మరికొందరు రైల్వే క్రాసింగ్ గేటు మూసి వేసిన తర్వాత కూడా కింద నుంచి బయటకు రావడం మనం చూస్తుంటాము. దానివల్ల ప్రమాదాలు జరిగే వీడియోలు కూడా నెట్టింట చూస్తూ ఉంటాము. ఈ వీడియో కూడా ఆ కోవకు చెందినది ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌ను హడావుడిగా దాటేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టాడు. రైలు మొత్తం అతని మీదుగా వెళ్ళింది. కానీ అతను ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి చెందిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

బీహార్‌లోని భాగల్‌పూర్‌లో ఓ వ్యక్తి ఒక ప్లాట్‌ఫాం నుంచి మరో ఫ్లాట్‌ఫామ్‌ వైపు వెళ్లేందుకు పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. స్టేషన్‌లో పట్టాలపై గూడ్స్‌ రైలు ఆగి ఉంది. దాని కింద నుంచి దాటి అవతలి ఫ్లాట్‌ఫామ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి ఉన్నప్పటికీ దానిని వదిలేసి షార్ట్‌కర్ట్‌ కోసం పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. పట్టాలపై ఉన్న రైలు కిందకు దూరగానే ఉన్నట్టుండి ట్రైన్‌ కదిలింది. దీంతో అతను రైలు కింద చిక్కుకుపోయాడు. భయంతో చప్పుడు చేయకుండా ఆ వ్యక్తి అలాగే పట్టాలపై పడుకొని ఉండిపోయాడు. ట్రైన్‌ కింద ఉన్న వ్యక్తికి ఏమైందో ఏమోనని చుట్టూ గుమిగూడిన జనం భయంతో చూస్తూ ఉండిపోయారు. రైలు వెళ్లేంతవరకు కదలవద్దని కేకలు వేస్తూ హెచ్చరించారు.
కాగా రైలు మొత్తం వెళ్లిపోయిన తర్వాత షాక్‌తో ఒక్కసారిగా లేచి నిలబడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతనికి ఏమి కాకపోవడంతో అక్కడున్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు.
సమీపంలో ఉన్న వ్యక్తులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వైరల్‌గా మారింది. నిజంగా అదృష్టం అంటే ఇదేనేమో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి:  ఓర్నీ.. తప్పతాగిన ఏనుగులు ఏం చేశాయో చూస్తే షాక్

Exit mobile version