Site icon Prime9

Viral Video: ఓ వింత వివాహం.. శ్రీకృష్ణుడితో కూతురి పెళ్లి జరిపించిన తండ్రి

lord-krishna-brings-procession-to-marry-disabled-girl-in-gwalior-madhyapradesh

lord-krishna-brings-procession-to-marry-disabled-girl-in-gwalior-madhyapradesh

Viral Video: మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఓ వింతైన వివాహం జరిగింది. ఓ యువతికి శ్రీకృష్ణుడితో వివాహం జరిగింది. కృష్ణ పరమాత్ముడేంటీ పెళ్లేంటి అనుకుంటున్నారు కదా అయితే ఈ కథనం చదివెయ్యండి.

మధ్యప్రదేశ్ గ్వాలియర్ కు చెందిన శివపాల్ అనే వ్యాపారవేత్త తన కుమార్తెను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. 21 యేళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితమైన ఆ యువతి మాట్లాడలేదు మరియు చెవులు కూడా వినపడవు. దీనితో ఆమెను వివాహం చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆమెకు వివాహం కావడం కష్టం అని భావించిన తండ్రి తన దివ్యాంగురాలైన కుమార్తెను సంతోషపెట్టాలని నిర్ణయించుకున్నాడు. దానికి ఓ ఆలోచన చేశాడు. తన కూతురిని తనకెంతో ఇష్టమైన శ్రీకృష్ణుడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను ఘనంగా చేశాడు.

బంధువులందరికీ ఫోన్లు చేసి తన కుమార్తె పెళ్లికి ఆహ్వానించారు. శ్రీకృష్ణుడితో వివాహం జరిపిస్తున్నారని తెలిసిన వారుంతా ఆశ్చర్యపోయారు. అసలు ఎలా జరిపిస్తారో అని చూసేందుకు చాలా మంది వచ్చారు. ఏదో తూతూ మంత్రంగా కాకుండా ఈ పెళ్లిని శివపాల్ చాలా ఘనంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మెహందీ, విందు, ఊరేగింపు సైతం నిర్వహించాడు. గుడిలో నిర్వహించిన ఈ వేడుకలో శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న ఓ యువతి, వధువు పూలదండలు మార్చుకోగా బంధుమిత్రులు ఆశీర్వదించారు.

ఇదీ చదవండి: ఈ నెల 19, 20ల్లో ఫార్ములా ఈ రేస్ ట్రయల్ రన్

Exit mobile version