Site icon Prime9

Bihar: బిహార్‌లో గ్రహాంతరవాసిలా శిశువు జననం..!

infant-born-with-rare-deformity-in-bihar

infant-born-with-rare-deformity-in-bihar

Bihar: బిహార్‌లో జన్మించిన ఓ వింత శిశువును స్థానికులు గ్రహాంతరవాసిగా ప్రచారం చేస్తున్నారు.ఎందుకలా అంటున్నారు అంటే శిశువు ముక్కు స్థానంలో రెండు కళ్లు ఉండడమే ఈ ప్రచారానికి కారణం.

వివరాల్లోకి వెళ్తే బిహార్ రాష్ట్రంలోని అలీషేర్‌పూర్‌కు చెందిన సరోజ పటేల్ భార్య రూపాదేవి ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, జన్యుపరమైన లోపాల కారణంగా శిశువు ముక్కు ఉండాల్సిన స్థానంలో కళ్లు ఉండడం వల్ల ఆ శిశువు చూడడానికి గ్రహాంతరవాసిలా ఉందని కొందరు మరి కొందరైతే వినాయకుడు పుట్టాడంటూ వేల సంఖ్యలో ప్రజలో ఆ చిన్నారిని చూడడానికి వస్తున్నారు. కాగా ఆ చిన్నారి శ్వాస తీసుకునేందుకు రంధ్రం లేకపోవడంతో వైద్యులు నోటి ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పైపులు ఏర్పాటు చేశారు. ఈ శిశువు జననం గురించి అక్కడి స్థానికులు పలు విధాలుగా ప్రచారం చేస్తున్నారు కాగా క్రోమోజోమ్‌ల లోపాలతో శిశువులు ఇలా జన్మిస్తారని గైనకాలజిస్టులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: కౌగిలింతల వైద్యం.. కాసులు సంపాదిస్తున్న మహిళ

Exit mobile version