Site icon Prime9

Virat Kohli: “2022 చివరి సూర్యోదయం”.. అంటూ విరాట్ కొహ్లీ, అనుష్కల పోస్ట్

Virat Anushka New Year Celebrations‘Last Sunrise of 2022’ post goes viral

Virat Anushka New Year Celebrations‘Last Sunrise of 2022’ post goes viral

Virat Kohli: ఈ సంవత్సరం మరికొద్ది గంటల్లో ముగియబోతోంది. ప్రపంచమంతా నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు మంచి పార్టీ మూడ్లోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ కూడా తమ నూతన సంవత్సర వేకేషన్ను దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అనుష్క చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ‘2022 చివరి సూర్యోదయం’ అంటూ ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేశారు.

దుబాయ్‌లో విహారయాత్ర చేస్తున్న కోహ్లీ మరియు అనుష్కలు తమ కూతురు వామికతో కలిసి కుటుంబ సమేతంగా ప్రశాంతమైన క్షణాల్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కోహ్లి తన భార్య అనుష్క శర్మతో కలిసి ఫోటో పర్ఫెక్ట్ మూమెంట్‌ను నెట్టింట అభిమానులతో పంచుకున్నాడు. మరియు “2022 చివరి సూర్యోదయం” అనే పోస్ట్‌కు క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇక ఈ ఫొటోను పరిశీలిస్తే ప్రశాంతమైన వాతారవణంలో సూర్యకిరణాలతో శీతాకాలపు పొగమంచును ఆస్వాదిస్తూ విరాట్ మరియు అనుష్కలు కెమెరాకు తమ వెనుకభాగాన్ని చూపుతూ నిలబడి ఉంటారు. ఈ చిత్రం చూడడానికి అందమైన పెయింటింగ్‌గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

virat anushka new year celebrations

టీమిండియా స్టార్ క్రికెటర్ రన్ మెషీన్ కొహ్లీ, బాలీవుడ్ అందాల తార అనుష్క శర్మ వారివారి వృత్తిరీత్యా పనుల్లో బిజీగా ఉన్న ఖాళీ దొరికినప్పుడల్లా ఇలా కుటుంబంతో ప్రశాంతమైన వెకేషన్స్ కు వెళ్తూ సంతోషంగా ఉండడాన్ని చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Exit mobile version