Site icon Prime9

Upcoming Releases : ఈ వారం ఓటీటీ/ థియేటర్లో రిలీజ్ కానున్న సినిమా/ వెబ్‌ సిరీస్‌లు ఇవేనా..?

upcoming releases of movies and web series details in august last week

upcoming releases of movies and web series details in august last week

Upcoming Releases :  ఆగస్టు నెల సినిమా లవర్స్ కి మంచి వినోదాన్ని పంచింది అని చెప్పాలి. పలు పెద్ద సినిమాలతో పాటు. చిన్న చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించగా.. పలు చిత్రాలు ఊహించని రీతిలో బోల్తా పడ్డాయి. ఇక మరో మూడు రోజుల్లో ఆగస్టు నెల ముగిసిపోతుండడంతో సెప్టెంబర్‌ నెల మొదటి వారంలో తమా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పలు మూవీస్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటిలో ముఖ్యంగా విజయ్ దేవరకొండ సినిమాపైనే ఆసక్తి నెలకొంది. ఇక ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చే చిత్రాలతో పాటు, ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు ఏవో మీకోసం ప్రత్యేకంగా..

ఖుషి..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో “ఖుషి” అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాలతో వచ్చిన లైగర్ చిత్రం భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో తనకి బాగా కలిసొచ్చిన లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు విజయ్. గతంలో శివ దర్శకత్వం వహించిన మజిలీ సినిమాలో సామ్ నటించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. అంతకు ముందు మహానటి చిత్రంలో విజయ్ – సామ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

నా… నీ ప్రేమకథ..

ఆముద శ్రీనివాస్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నా… నీ ప్రేమకథ’. కారుణ్య చౌదరి హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాని శ్రవణ్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా సెప్టెంబరు 2న థియేటర్‌లో విడుదల కానుంది. ఒక ఊరిలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందినట్లు మూవీ యూనిట్ చెబుతుంది.

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌ సిరీస్‌ల వివరాలు (Upcoming Releases)..

నెట్‌ఫ్లిక్స్‌..

ఎలోన్‌ (రియాల్టీ షో) ఆగస్టు 30

చూజ్‌ లవ్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 31

వన్‌ పీస్‌ (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 31

ఫ్రైడే నైట్‌ ప్లాన్‌ (హిందీ) సెప్టెంబరు 1

హ్యాపీ ఎండింగ్‌ (హాలీవుడ్) సెప్టెంబరు 1

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో..

ది వీల్‌ ఆఫ్‌ టైమ్‌ (వెబ్‌ సిరీస్‌) సెప్టెంబరు 1

సోనీలివ్‌..

స్కామ్‌ 2003 (హిందీ/తెలుగు సిరీస్‌) సెప్టెంబరు 1

జీ5..

డీడీ రిటర్న్స్‌ (తమిళ్‌/తెలుగు) సెప్టెంబరు 1

 

Exit mobile version