Unstoppable 2: పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్-2 షో కి సమయం ఆసన్నమైంది. మరి కొన్ని గంటల్లో ఈ షో స్ట్రీమింగ్ కానుంది. పవన్ కళ్యాణ్- బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో రెండు భాగాలుగా రానుంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ 2 షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. సీజన్ 1 ని తనదైన శైలిలో బ్లాక్ బస్టర్ చేసిన బాలయ్య.. సీజన్ 2 ని ఒక రేంజ్ లో తీసుకెళ్తున్నారు.
The Power-Packed treat is here!!!
Balayya energy, PSPK swag tho ee Grand Finale ni POWER Finale chesesaru. Aa racchendho chudalante inko roju aagalsindhe!
Get ready for the 'Baap of all episodes Part 1'. #PawanKalyanOnAHA allari mamulga undadu. #PSPKOnAhaFEB2 1 day to go 🔥!! pic.twitter.com/f5K1QoCvgl
— ahavideoin (@ahavideoIN) February 1, 2023
సెకండ్ సీజన్ లో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పాల్గొంటూ అభిమానులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించింది ఈ షో.
ఇటీవలే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ షో కి గెస్టుగా వచ్చారు. ఈ ఎపిసోడ్‌ను ప్రేక్షకులు ఏ రేంజ్ లో చూశారంటే.. దెబ్బకి ఆహా యాప్ కూడా క్రాష్ అయ్యేంతలా.
ప్రభాస్ టాక్ షో ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేసింది ఆహా.
అయితే, ప్రజెంట్ అందరి చూపులు పవర్ ఫుల్ ఎపిసోడ్ పైనా ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan kalyan ఈ టాక్ షో లో పాల్గొన్నాడు.
అయితే ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని అందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. దానికి ఆ టైం రానే వచ్చింది.
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు సంబంధించి ఆహా అప్ డేట్ ఇచ్చింది.
ఈ షో.. ఫిబ్రవరి 2 రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.
ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ఓ స్పెషల్ గ్రింప్స్‌ను వదిలారు.
పవన్ కళ్యాణ్ వర్సెస్ బాలయ్య మధ్య ఆసక్తికర విషయాలు జరిగాయి.
ఈ గ్లింప్స్ లో తమ్ముడు సినిమాలో పవన్ చేసిన కొన్ని సన్నివేశాలు డూపా అని బాలయ్య అడిగారు.
బాలకృష్ణ ప్రశ్నకు పవన్ నవ్వుతూ సమాధానం చెప్పారు.
నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీ వేదికగా అన్ స్టాపబుల్ షో.
తన డైలాగ్స్, మేనరిజంతో షో ను ముందుకు తీసుకెళుతున్న బాలయ్య.
అయితే ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ ఈ షో కు హైలెట్ అవ్వనున్నాడు.
పంచెకట్టులో వచ్చిన సాయి ధరమ్ తేజ్ గ్లింప్స్ ఇది వరకే వైరల్ అయింది.
ఫిబ్రవరి 2 రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్న పవన్ కళ్యాణ్ షో.
ఈ షో కొరకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న పవన్ అభిమానులు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/