Success Meet: వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో అపశృతి చోటు చేసుకుంది. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న విజయోత్సవ సభకు అభిమానులు వేలాది సంఖ్యలో వచ్చారు. వీరు ఒక్కసారిగా గేట్లను తోసుకొని ముందుకు వెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో చిరంజీవి అభిమానులు.. పోలీసుల మధ్య తోపులాట జరిగింది.
ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
సభకు ఒక్కసారిగా గేటు తీయడంతో.. అభిమానులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. గేటు బయట వేచి ఉన్న అభిమానులు.. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఇందులో పలువురు గాయపడ్డారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది.
సినిమా ఘన విజయంతో.. హనుమకొండలో విజయోత్సవ వేడుక నిర్వహిస్తుంది.
ఈ వేడుకకు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
భద్రతా సిబ్బంది ఒక్కొక్కరిని కాకుండా అందరిని ఒకేసారి లోపలికి వదలడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.
వాల్తేరు వీరయ్య Waltair Veerayyaమూవీలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించాడు.
చిరుకి జోడిగా శృతి హాసన్ నటించింది. ఇక ఈ సినిమాలో రవితేజ కీలక పాత్ర పోషించాడు.
రవితేజకి భార్యగా కేథరిన్ నటించింది. ఈ సినిమాలో ప్రతినాయక పాత్రలో ప్రకాశ్ రాజ్.. బాబీ సింహా నటించారు.
జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది.
ఈ మూవీ.. సుమారు రూ. 220 కోట్లకి పైగా వసూళ్లని రాబట్టింది.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించగా.. బాబీ దర్శకత్వం వహించాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.
ఈ సినిమాకు బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా చేసిన ఐటం సాంగ్ అందరిని అలరించింది.
ఈ సినిమా విజయంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బాస్ ఈజ్ బ్యాక్ అంటూ.. చిరు అభిమానులు ఈ సినిమాతో పండగ చేసుకున్నారు.
చిరంజీవిని మాస్ పాత్రలో చూడడంతో ప్రేక్షకులు రెట్టించిన ఉత్సాహంతో సినిమాకు భారీ సక్సెస్ ను అందించారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/