Site icon Prime9

Samantha: మీకు నాలాగ అవ్వకూడదంటూ.. వారికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన సమంత

samantha shocking reply to trollers about her health

samantha shocking reply to trollers about her health

Samantha : టాలీవుడ్ ముద్దుగుమ్మ, స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న తాజా చిత్రం “శాకుంతలం”. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో భారీ బడ్జెట్ తో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ క‌వి కాళిదాసు ర‌చించిన సంస్కృత‌ నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా చేసుకుని.. గుణ శేఖ‌ర్‌ ఈ సినిమాని తీస్తున్నారు. ఈ పౌరాణిక దృశ్యకావ్యాన్ని ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. విజువల్ వండర్ గా వస్తున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని చెప్పడానికి ఈ ట్రైలర్ ఉదాహరణగా నిలిచింది.

కాగా ఒక వైపు నాగచైతన్యతో విడాకుల కారణంగా మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు సమంత. ఆ సమయంలో బాగా లో య్యారని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత ఇటీవలే తాను మయోసైటీస్ తో బాధపడుతున్నానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది ఈ భామ. దీంతో అనారోగ్యం కారణంగా ఎక్కువగా యాక్టివ్ గా ఉండడం లేదు. ఇక చాలా గ్యాప్ తర్వాత సోమవారం జరిగిన ట్రైలర్‌ లాంఛ్ ఈవెంట్ లో సామ్ పాల్గొంది. శాకుంతలలానికి గుణశేఖర్‌ తనను ఎంచుకోవడం తన అదృష్టం అని చెప్పుకొచ్చింది. జీవితంలో తాను ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా సినిమా నన్ను ప్రేమించడం మాత్రం తగ్గలేదు. శాకుంతలంతో ఈ ప్రేమ మరింత పెరుగుతుందని సమంత ధీమా వ్యక్తం చేసింది. అలానే ఈ కార్యక్రమంలో సమంత కంటతడి పట్టుకోవడం గురించి అందరికీ తెలిసిందే. సమంత భావోద్వేగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

మీకోసం ప్రార్ధిస్తున్న…

అయితే ట్విట్టర్ వేదికగా కొన్ని పేజెస్ ఈ ప్రెస్ మీట్ కి, ట్రైలర్ కి సంబంధించి ట్వీట్ చేశాయి. వాటిలో #Buzz Basket అనే పేజీ సమంత గురించి ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో.. “సమంత తన మునుపటి ఆకర్షణను కోల్పోయింది. విడాకుల బాధ నుంచి కొలుకొని కెరీర్ పరంగా ఉన్నతంగా ఎదిగే క్రమంలో మయోసైటీస్ ఆమెను పెద్ద దెబ్బ తీసింది. మళ్ళీ ఆమె కుంగిపోయింది” అని రాశారు. ఈ ట్వీట్‌ని రీట్వీట్ చేసిన సమంత, ‘నేను తీసుకున్నంత చికిత్స మరియు మందులు మీరు తీసుకోవద్దని నేను ప్రార్థిస్తున్నాను. మీరు మరింత మనోహరంగా ఉండటానికి నా వైపు నుండి కొంచెం ప్రేమ’ అని సమంత రాసింది. ప్రస్తుతం సమంత చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. సమంత అనారోగ్యం పాలైన తర్వాత చాలా మంది ఇలా చెప్పినా.. ఆమె ఇంత కూల్‌గా, మంచి మనసుతో ట్వీట్ చేయడం సంతోషకరమైన విషయమని పలువురు రాసుకొచ్చారు. పలు కారణాలతో జీవితంలో కుంగిపోయిన సామ్ గురించి ఇలా రాయడం పట్ల ఆమె అభిమానులు ఆ ట్వీట్ పై మండిపడుతున్నారు.

 

 

ఇవి కూడా చదవండి…

Shaakunthalam Trailer: ‘శాకుంతలం’ ట్రైలర్.. కళ్లు చెదిరే విజువల్ వండర్ లో సమంత

Samantha: ఓపిక లేకపోయినా వచ్చాను.. కన్నీరు పెట్టుకున్న సమంత

Dil Raju: నన్ను కార్నర్ చేసే సీన్ ఎవరికీ లేదు.. కానీ నా సినిమా రెండు రోజులు వాయిదా వేసుకున్నాను.. దిల్ రాజు

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version