Site icon Prime9

Samantha : సమంత మళ్ళీ అక్కినేని ఫ్యామిలీకి దగ్గరవుతుందా.. అక్కినేని అఖిల్ పోస్ట్ కి ఏమని కామెంట్ చేసిందంటే?

samantha interesting comment on akkineni akhil post

samantha interesting comment on akkineni akhil post

Samantha : టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్స్ ఒకరు సమంత, నాగ చైతన్య.

చై, సామ్ కలిసి నటించిన ఏ మాయ చేశావే సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న వీరిద్దరూ.. ఆ తర్వాత ప్రేమించుకుని, పెద్దలని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు.

వివాహం చేసుకున్నప్పటి నుంచి ఈ దంపతులు చాలా ప్రేమగా ఉన్నారు.

పెండ్లి జరిగినా సరిగ్గా నాలుగు సంవత్సరాలకు.. అందరికి షాక్ ఇస్తూ వీరిద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే.

దానికి గల కారణాలు ఏంటి అని ఇప్పటి వరకు ఎవరు ఓపెన్ గా చెప్పలేదు.

అయితే సామ్, చై అభిమానులు మాత్రం వీరిద్దరూ మళ్ళీ కలిసిపోతే బాగుండు అని ఫీల్ అవుతున్నారు.

కాగా విడిపోయిన తరువాత కూడా ఇటీవల కాలంలో సమంత, అక్కినేని కుటుంబం మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

 

సమంత సినిమాలకు అక్కినేని హీరోలు, అక్కినేని హీరోల సినిమాలకు సమంత రియాక్ట్ అవ్వడం అందర్నీ ఆకట్టుకుంటుంది.

అలానే ముఖ్యంగా సమంత మయోసైటీస్ తో బాధపడుతున్నట్లు ప్రకటించినప్పుడు అఖిల్ కూడా ‘స్టే స్ట్రాంగ్ సామ్’ అంటూ కామెంట్ చేసి ధైర్యం చెప్పాడు.

తాజాగా అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ ఒక పవర్ ఫుల్ వీడియోని ఈ ఫిబ్రవరి 4న రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ వీడియోని అఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా, దానిపై పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

 

 

(Samantha) బీస్ట్ మోడ్ ఆన్ అంటున్న సామ్..

 

ఈ క్రమంలోనే సమంత కూడా స్పందించింది.

‘బీస్ట్ మోడ్ ఆన్’ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్ హైలైట్ గా మారింది.

గతంలో అఖిల్ పుట్టినరోజు నాడు కూడా సమంత అఖిల్ కి ఇన్‌స్టాగ్రామ్ లో విష్ చేసిన సంగతి తెలిసిందే.

అలాగే అక్కినేని హీరోలు కూడా సమంత పోస్ట్ లకు స్పందిస్తున్నారు.

ఇక మరో అక్కినేని హీరో సుశాంత్.. సమంత శాకుంతలం టీంకి అభినందనలు తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాడు.

ఇవన్నీ చూస్తుంటే విడాకులు తరువాత కూడా అక్కినేని కుటుంబంతో సమంత రిలేషన్ బాగానే ఉంది అని అర్ధమవుతుంది.

కాగా అఖిల్ బీస్ట్ సినిమాని ఏప్రిల్ 28న రిలీజ్ చేయబోతున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేంద్ర రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

 

ఈ వీడియోలో … అఖిల్‌ను ఓ ఉగ్రవాద సంస్థ కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. చేతులు, కాళ్లు కట్టేసి.. ముఖానికి మాస్క్‌ తొడిగి చిత్రహింసలకు గురిచేస్తుంటారు.

నిన్ను ఎవరు పంపారు, పోలీసా, రా నా.. ఈ నెట్వర్క్‌లోకి ఎవరు పంపారు సాలే.. చెప్పు అంటూ ఓ వ్యక్తి అఖిల్‌ను కొడుతుంటాడు.

ఇందుకు అఖిల్ ఇంటెన్స్ టోన్‌లో ఒసామా బిన్ లాడెన్, గడాఫీ, హిట్లర్ పంపారు బే అనగా.. సాలే చెప్పు అంటూ మళ్లీ గట్టిగా కొడతారు.. సాలే నహీం.. వైల్డ్ సాలే బోల్ అంటూ అఖిల్ డైలాగ్‌ చెప్పడం హైలైట్ గా మారింది.

ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ మూవీలో ఓ కీలక పాత్రను పోషించారు. సాక్షి వైద్య ఈ మూవీతోనే టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version