Site icon Prime9

Unstoppable 2 : పవన్ కళ్యాణ్ తో కలిసి బాలకృష్ణ అన్ స్టాపబుల్ లో సందడి చేసిన సాయి ధరమ్ తేజ్.. పిక్స్ వైరల్

sai dharam tej in pavan kalyan episode in unstoppable show pic goes viral

sai dharam tej in pavan kalyan episode in unstoppable show pic goes viral

Unstoppable 2 : నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీ వేదికగా ‘అన్ స్టాపబుల్’ షో చేస్తున్న విషయం తెలిసిందే. పేరుకి తగ్గట్టు గానే ఈ షో అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది. తనదైన డైలాగ్స్, మేనరిజంతో మొదటి సీజన్ సక్సెస్ చేసిన బాలయ్య.. ఈ సీజన్ ని అంతకు మించిన అనే రేంజ్ లో కొనసాగిస్తున్నారు.

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు, శర్వానంద్, అల్లు అరవింద్, ప్రభాస్ వంటి ప్రముఖులు రెండో సీజన్ లో రాగా.. ఇప్పుడు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నారు.

ఈ ఎపిసోడ్ కు సంబంధించిన టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అందులో పవన్ ను బాలకృష్ణ పలు ఆసక్తికర ప్రశ్నలు అడగడం టీజర్ లో చూపించారు.

అయితే ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా పాల్గొనట్లు తెలుస్తుంది.

వైరల్ గా మారిన అన్ స్టాపబుల్ (Unstoppable 2) లో సాయి ధరమ్ తేజ్ పిక్..

ఈ మేరకు సోషల్ మీడియా లో బాలయ్య, పవన్ తో పాటు సాయి ధరమ్ తేజ్ ఉన్న ఫొటోలు వైరల్ గా మారాయి.

ఆ ఫోటోలో సాయి తేజ్ నల్ల షర్ట్, తెల్ల పంచెతో కనిపించారు.

పవన్ కళ్యాణ్ తన మేనల్లుళ్ల గురించి మాట్లాడుతున్న సమయంలోనే సాయి ధరమ్ సడన్ ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరిచినట్లు సమాచారం అందుతుంది.

బైక్ యాక్సిడెంట్ తర్వాత పెద్దగా బయటికి కనిపించని సాయి.. ఇటీవల తన తమ్ముడు వైష్ణవ్ తేజ్ సినిమా ఈవెంట్ కు మాత్రమే వచ్చారు.

ఇప్పుడు అన్ స్టాపబుల్ లో కనిపించనున్నారు. ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడనేది ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఆహాలో ప్రసారం కానుంది.

బాలయ్యతో మామా అల్లుళ్లు ఏమేం విశేషాలు పంచుకున్నారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి..!

పవన్ అన్ స్టాపబుల్ (Unstoppable 2) టీజర్ లో..

అందుకే నన్ను బాలా అని పిలవమంటానని బాలకృష్ణ చెప్పడంతో టీజర్ స్టార్ట్ అవుతుంది. దానికి పవన్ కళ్యాణ్ నేను ఓడిపోవడానికైనా సిద్దమే కాని అలా పిలవనంటారు.

ఈ పాలిటిక్సే వద్దంటూ బాలయ్య అంటూ.. ఇపుడు నీ విమర్శల్లో వాడీ వేడీ డబుల్ ఇంపాక్ట్ అయింది.. అని బాలయ్య అనగానే నేను చాలా పద్దతిగా మాట్లాడతానండి అంటూ పవన్ సమాధానమిచ్చారు.

మీ అన్నయ్య చిరంజీవి గారి నుంచి నేర్చుకున్నవేంటి? వద్దనుకున్నవేంటి? అని బాలయ్య ప్రశ్నించడం ఈ టీజర్ లో కనిపించింది.

మరో సందర్బంలో మా వదినకు ఫోన్ చేసి ఇదే నా లాస్ట్ మూవీ అని చెప్పానని పవన్ అంటారు.

రాష్ట్రంలో నీ ఫ్యాన్ కానివాడు ఎవరూ లేడు.. మరి ఈ ప్రేమ ఓట్ల రూపంలోకి ఎందుకు మారలేదు అంటూ బాలయ్య ప్రశ్నిస్తారు.. దానికి పవన్ సమాధానం మాత్రం ఫుల్ ఎపిసోడ్ లో చూడాలి.

టీజర్ చివరిలో మేము బ్యాడ్ బాయ్స్… 12345678910 అంటూ బాలయ్య చెప్పడంతో ముగుస్తుంది టీజర్.

అన్‌స్టాపబుల్ రెండో సీజన్‌కు ఇది ఆఖరి ఎపిసోడ్ కానుందని వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్, గోపిచంద్‌ల ఎపిసోడ్ రెండు భాగాలుగా విడుదల చేసిన విషయం తెలిసిందే.

అయితే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌ను కూడా రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తారా ? ఒక పార్ట్ గానే చేస్తారా ?? అనేది తెలియాల్సి ఉంది.

త్వరలోనే ఈ ఎపిసోడ్ కి సంబంధించి స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version