Site icon Prime9

Pawan Kalyan In Unstoppable 2 : కారు పైకి ఎక్కడానికి కారణం అదేనని చెప్పిన జనసేనాని పవన్ కళ్యాణ్..

reason behind sitting on car top shared by Pawan Kalyan In Unstoppable 2

reason behind sitting on car top shared by Pawan Kalyan In Unstoppable 2

Pawan Kalyan In Unstoppable 2 : ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో కి నందమూరి బాలకృష్ణ  హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ మేరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల బాలయ్య షో లో పాల్గొన్నారు. పవన్ ఎపిసోడ్ ని రెండు పార్ట్ లుగా రిలీజ్ చేశారు.

ఇటీవలే రిలీజ్ అయిన ఫస్ట్ పార్ట్ రికార్డులన్నీటిని చెరిపేసి కొత్త రికార్డులను సృష్టించింది.

దీంతో అటు నందమూరి అభిమానులు.. ఇటు మెగా అభిమానులు రెండో ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూశారు.

ఈ తరుణంలోనే తాజాగా రిలీజ్ అయిన ఎపిసోడ్ కూడా ఓ రేంజ్ లో అందర్నీ అలరిస్తుంది అని చెప్పాలి.

ఈ సంధర్భంగా వైజాగ్ ఘటన గురించి, కారు పైకి ఎక్కి ఇప్పటం గ్రామానికి వెళ్ళడం గురించి పవన్ ని బాలకృష్ణ ప్రశ్నించారు. అందుకు పవన్ కళ్యాణ్ అదిరిపోయే రిప్లయ్ ఇచ్చారు.

(Pawan Kalyan In Unstoppable 2)వీళ్ళు చేసే పనుల వల్ల నాకు తిక్క రేగింది – పవన్ కళ్యాణ్

విశాఖపట్నంలో జరిగిన ఘటన గురించి స్పందిస్తూ.. ‘‘నేను ఓ అడుగు వేసినా, మాట్లాలనుకున్నా ప్రభుత్వంలో ఉండేవారందరికీ  ఇబ్బందిగా ఉంటుంది. నేను మామూలుగా చూసినా దానికీ ఓ అర్థం తీస్తారు. నేను వైజాగ్‌ వెళ్లకూడదని ఎన్నో కుట్రలు పన్నారు. కానీ, నేను వాళ్లతో పోటీ పెట్టుకోలేదు. వారి ఆలోచన ఏంటో తెలియదుగాని లైట్‌ ఆపేయడంలాంటివి చేశారు. అవన్నీ సహజమే గానీ అధికార యంత్రాంగం కూడా హద్దులు దాటి అమాయికులు, ఓ మహిళపై హత్యాయత్నం కేసులు పెట్టారు. ఆధిపత్య ధోరణి అది. ఎవరూ నోరెత్తకూడదంటే ఎలా? నేను నోరెత్తుతా.. అది ప్రజలకు చేరుతుందన్న ఇబ్బంది వారికి ఉందనుకుంటా. అయితే నేను దాన్ని రాజకీయంలో భాగంగానే చూస్తా అని చెప్పారు.

ఇప్పటం గ్రామం వెళ్లేటపుడూ అలానే వ్యవహరించారు. ‘మీరు అక్కడికి వెళ్లకూడదు. వెళ్తే గొడవ చేస్తారు’ అంటూ పోలీసు అధికారులు నన్ను ఆపారు. ‘బాధితులను పరామర్శించడం నా ప్రాథమిక హక్కు’ అని చెప్పా. రోడ్డుపై నడవకూడదు, కారులోంచి బయటకు రాకూడదు, రూమ్‌లో ఉండకూడదు, రూమ్‌లోంచి బయటకు రాకూడదు.. అని అంటుంటే చాలాకాలం తర్వాత నాకు కొంచెం తిక్క వచ్చింది. అందుకే ఎవరు ఆపుతారో చూద్దాం అంటూ కారుపైకి ఎక్కి కూర్చొన్నా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను నడుస్తా. ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. నేను వెళ్తా అన్న ధోరణిలో అక్కడికి వెళ్లా ’’ అని పవన్‌ కల్యాణ్‌ వివరించారు.

తనదైన డైలాగ్స్, మాట తీరుతో అన్ స్టాపబుల్ సీజన్ 1 ని సూపర్ సక్సెస్ చేసిన బాలకృష్ణ.. ఈ సీజన్ ని కూడా అంతకు మించేలా చేసి అదరగొట్టారు. ఈ షో లో ఇప్పటికే చంద్రబాబు నాయుడు, ప్రభాస్, శర్వానంద్, అడవి శేష్, విశ్వక్ సేన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా షో లో పాల్గొని ఈ సీజన్ లాస్ట్ ఎపిసోడ్ ని ఆకాశం అంత ఎత్తులో నిలిపారు. ఈ ఎపిసోడ్ ఇప్పుడు అదిరిపోయే వ్యూస్ తో ఓటీటీ రికార్డులను బద్దలు కొడుతూ  దూసుకుపోతుంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version
Skip to toolbar