Rana Naidu : దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలైన విక్టరీ వెంకటేష్, రానా మొదటిసారి కలిసి నటించిన వెబ్ సిరీస్ “రానా నాయుడు”.
నెట్ ఫ్లిక్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సిరీస్ కు కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ దర్శకత్వం వహించారు.
ఈ సిరీస్ లో వెంకటేష్, రానా తండ్రి కొడుకులుగా కనిపించనున్నారు.
ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఫేమస్ అమెరికన్ సిరీస్ రే డోనోవన్ కు రీమేక్ గా ఇది తెరకెక్కింది. రానా నాయుడు ప్రీమియర్ మార్చి 10, 2023న నెట్ ఫ్లిక్స్ లో అవ్వబోతోంది.
దీంతో మేకర్స్ ప్రమోషన్స్ లో జోరు పెంచారు.
ఈ మేరకు గత రెండు రోజులుగా రానా, వెంకటేష్.. సోషల్ మీడియాలో ఒకరికి ఒకరు వార్నింగ్ లు ఇచ్చుకుంటూ సిరీస్ ట్రైలర్ గురించి అప్డేట్ ఇచ్చి ఆసక్తి పెంచారు.
ఇక తాజాగా ముంబైలో ఈ సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ ని చూస్తే.. ఎవరైనా సెలబ్రిటీకి సమస్య వస్తే.. ముందు నీకే ఫోన్ వెళ్తుంది. ఫిక్సర్ ఫర్ ద స్టార్స్’’ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది.‘‘ ప్రతి బాలీవుడ్ స్కాండల్‌లో రానా నాయుడు పేరు వస్తుంది. రానా ఉన్నాడంటే ఆ స్కాండల్ పెద్దదని అర్థం’’ అని చూపించారు. అలాగే, జైల్లో ఉండే వెంకటేష్ (నాగా నాయుడు) పాత్రను కూడా పవర్ ఫుల్‌గా చూపించారు. తన కుటుంబాన్ని కాపాడుకొనే పాత్రలో వెంకీ కనిపించారు. అయితే, రానాకు అతడి తండ్రి నాగాకు మధ్య ఎందుకు గొడవలు జరుగుతాయనేది మాత్రం బుల్లితెరపైనే చూడాలి.
(Rana Naidu)బోల్డ్ డైలాగ్ తో రెచ్చిపోయిన వెంకీ..
అయితే చివర్లో వెంకటేష్ చెప్పే డైలాగ్ వింటే తప్పకుండా అభిమానులు ఆశ్చర్యపోతారు. ‘నువ్వు పుట్టినప్పటి నుంచీ నీ ముడ్డి కడిగానురా నీకు ఐదేళ్లు వచ్చేంత వరకు. నాకు బాగా తెలుసు అందులో ఎంత దమ్ముందో ఎంత లేదో’.. అని ఫస్ట్ టైమ్ ఇలాంటి బోల్డ్ డైలాగ్స్ వెంకటేష్ చెప్పడం అందరికీ షాక్ అనే చెప్పాలి. వెంకటేష్ ముఖ్యంగా ఆ నెరిసిన గడ్డం, జుట్టుతో అల్ట్రా స్టైలిష్ గా కనిపించాడు. రానా- వెంకీల మధ్య ఫైట్స్ సిరీస్ కు హైలైట్ గా నిలుస్తాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా దూసుకుపోతుంది.
Rana and Venky Mama dhee konte choodalanna, ee feeling Rana Naidu vasthe kaani thaggela ledhu! 🤯👀#RanaNaidu, releasing on March 10. pic.twitter.com/mOnbRGA5oA
— Netflix India South (@Netflix_INSouth) February 15, 2023
ఈ ట్రైలర్ విడుదలకు ముందు వెంకీ, రానాలు ప్రమోషన్ లో భాగంగా.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మొదట వెంకటేష్ ఈ సిరీస్ పేరును మార్చాలని నెట్‌ఫ్లిక్స్‌ను హెచ్చరించాడు. ‘‘నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నెట్‌ఫ్లిక్స్. రానా నాయుడు సిరీస్‌లో హీరో ఎవరు? నేను. అందరికంటే పెద్ద స్టార్ కూడా నేనే. అందంగా ఉంది కూడా నేనే. ఫ్యాన్స్ కూడా నాకు సంబంధించిన వాళ్లే. కాబట్టి ఈ సిరీస్‌కు రానా నాయుడు అని కాదు నాగా నాయుడు అనే పేరు ఉండాలి. నాతో మజాక్‌లు వద్దు.’’ అని వార్నింగ్ ఇచ్చారు వెంకీ. ఆ తర్వాత రానా దానికి బదులుగా ‘‘ట్రైలర్ లాంచ్‌కు రా. అయితే నీకు గేట్ దగ్గర ఎంట్రీ దొరక్కపోతే అప్పుడు నువ్వు రానా నాయుడు తండ్రివని చెప్పు. నీ ఎంట్రీ సంగతి రానా చూసుకుంటాడు.’’ అని రిప్లై ఇచ్చాడు. మొత్తానికి ఈ బాబాయ్ – కొడుకులను ఒకే సిరీస్ లో చూసేందుకు దగ్గుబాటి ఫ్యాన్స్ అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/