Site icon Prime9

Ram Charan Tej : చరిత్ర సృష్టించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆ విషయంలో మొట్టమొదటి ఇండియన్ హీరో

ram charan tej creating history as a presenter in hollywood awards function

ram charan tej creating history as a presenter in hollywood awards function

Ram Charan Tej : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చరిత్ర సృష్టించారు. ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఏకంగా హాలీవుడ్ గడ్డపైనా తెలుగు హీరో  పేరు చెబితేనే వచ్చే అరుపులు కేకలు వేస్తున్నారంటే.. చెర్రీ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అని. ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు రామ్ చరణ్ తేజ్. ముఖ్యంగా హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సైతం రామ్ చరణ్ ని పొగడ్తలతో ముంచెత్తారు. ఇటీవల ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ పాత్ర గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ పాత్ర తనకు ఎంతో నచ్చిందంటూ కితాబిచ్చారు కామరూన్. కాకపోతే ఆ పాత్రను అర్ధం చేసుకోవడానికి కాస్త టైమ్ పడుతుందన్నారు. కానీ ఒకసారి ఆ పాత్ర అర్థమయ్యాక హృదయం బరువెక్కుతుందంటూ వ్యాఖ్యానించారు.

ఏ అవార్డుకు రామ్ చరణ్ (Ram Charan Tej) ప్రజెంటర్ గా చేశారంటే..?

రామ్ చరణ్ ప్రస్తుతం ఆస్కార్స్ ప్రమోషన్స్ కోసం అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రముఖ అంతర్జాతీయ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొని అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమంలో అవార్డు ప్రజెంటర్ గా గౌరవం దక్కించుకున్నారు. బెస్ట్ వాయిస్ ఓవర్ అవార్డును అందజేశారు. దీంతో అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ నటుడిగా రామ్ చరణ్ చరిత్ర సృష్టించారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

 

హాలీవుడ్ గడ్డపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతుండటంతో మెగా ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. చరణ్ తో పాటు ఉన్న తోటి ప్రెజెనటర్ కూడా అతని గురించి మరింత గొప్పగా చెప్పడం ప్రత్యేక విషయం అని చెప్పాలి. తమ అభిమాన హీరో ఎదుగుదలను సోషల్ మీడియా ద్వారా చాటి చెబుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఆస్కార్స్2023’ ప్రమోషన్స్ లో అమెరికాలోని ఆయా మీడియా సంస్థలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం హెచ్సీఏ అవార్స్ వేదికకు హాజరై ఆకట్టుకున్నారు.

 

ఈ పీరియాడికల్ డ్రామా ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టగా.. వాటిలో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్ అవార్డులు కూడా ఉన్నాయి. తాజాగా ఈ చిత్రాన్ని మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డులలో ప్రధానోత్సవంలో ఆర్ఆర్ఆర్ అవార్డుల పంట పండించింది. ఏకంగా 5 కేటగిరీల్లో అవార్డులను కైవసం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమాకి ‘బెస్ట్‌ స్టంట్స్‌’.. ‘బెస్ట్‌ యాక్షన్‌ మూవీ’.. ‘బెస్ట్‌ ఒరిజినల్ సాంగ్‌’.. ‘బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్’.. స్పాట్ లైట్ అవార్డులను.. సొంతం చేసుకుంది.  ఈ కార్యక్రమానికి ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ నుంచి రాజమౌళి, రామ్ చరణ్, కీరవాణి, కార్తికేయ హాజరయ్యారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version