Site icon Prime9

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయిన ప్రైమ్ 9 న్యూస్ సిఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు.. వాటి గురించే చర్చ?

prime 9 news ceo venkateswara rao meeting with megastar chiranjeevi

prime 9 news ceo venkateswara rao meeting with megastar chiranjeevi

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు.

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు.

ఇటీవలే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు.

అయితే ఇప్పుడు అదే జోష్ ని కొనసాగిస్తూ తన నెక్స్ట్ సినిమాని స్పీడ్ గా షురూ చేస్తున్నారు.

చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘భోళా శంకర్‌’.

తమిళ సూపర్‌ హిట్‌ సినిమా వేదాళంకి రీమేక్ గా తెరకెక్కుతుంది.

ఇందులో చిరంజీవి సరసన తమన్నా నటిస్తుండగా, చిరు చెల్లెలిగా కీర్తి సురేశ్‌ నటిస్తుంది.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

 

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తో ప్రైమ్ 9 న్యూస్ సిఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు భేటీ..

 

అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవిని ప్రైమ్ 9 న్యూస్ సిఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు మర్యాద పూర్వకంగా కలిశారు.

ముందుగా వాల్తేరు వీరయ్యతో సూపర్ సక్సెస్ అందుకున్న చిరంజీవికి వెంకటేశ్వరరావు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

అలానే ఈ సందర్భంగా చిరుతో వెంకటేశ్వరరావు భేటీ అయ్యారు.

ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ, సినీ అంశాలపై వారు చర్చించుకున్నారు.

ముఖ్యంగా జనసేన పార్టీకి చిరంజీవి మద్దతు ఉంటుందా అనే పలు అంశాలపై వెంకటేశ్వరరావు మాట్లాడినట్లు తెలుస్తుంది.

కాగా శుక్రవారం నాడు భోళా శంకర్ సినిమా షూటింగ్ లో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవిని మూవీ యూనిట్ అంతా సన్మానించారు.

వాల్తేరు వీరయ్య మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్నందుకు గాను ఈ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

ఇందులో మూవీ యూనిట్ తో పాటు కీర్తి సురేష్ కూడా పాల్గొన్నారు.

ఇదే సెట్ లో ప్రైమ్ 9 సిఈఓ వెంకటేశ్వరరావు కూడా చిరంజీవిని మీట్ అయ్యారు.

ఇరు తెలుగు రాష్ట్రాలలో ప్రజల మన్ననలు పొందుతూ దూసుకుపోతున్న ప్రైమ్ 9 మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని.. చిరంజీవి ఆశా భావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

వాల్తేరు వీరయ్య సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కించగా.. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

ఈ నెల 13వ తేదీన వాల్తేరు వీరయ్య సినిమా థియేటర్లకు వచ్చింది.

పండగ నాడు పక్కా కమర్షియల్, మాస్, ఎమోషన్ ఎలిమెంట్స్ తో వచ్చి అభిమానులనే కాక ప్రేక్షకులని కూడా అలరిస్తుంది ఈ సినిమా.

తెలుగుతో పాటు హిందీలో కూడా వాల్తేరు వీరయ్య రిలీజ్ అయింది.

శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో కనిపించాడు.

ఇక ఇప్పటికే దాదాపు 150 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం 200 కోట్ల క్లబ్ లో చేరేందుకు ఎక్కువ రోజుల పట్టేలా లేదని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version