Site icon Prime9

Unstoppable Show : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ పిక్స్

pawan kalyan pics from unstoppable show goes viral

pawan kalyan pics from unstoppable show goes viral

Unstoppable Show : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కి అభిమానుల కంటే ఎక్కువగా భక్తులే ఉంటారని ఇటీవల ఒక ప్రముఖ నటుడు వ్యాఖ్యానించారు. ఆ మాట నిజమే అని పలు సందర్భాలను గమనిస్తే అనిపిస్తూ ఉంటుంది. ఇక ఆయన సినిమాలు వస్తున్నాయంటే చాలు ఫ్యాన్ కు పూనకాలే అని చెప్పాలి. ప్రస్తుతం ఒక వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు పవన్. అయితే తాజాగా పవన్ కళ్యాణ్, బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కు గెస్ట్ గా హాజరవుతారని తెలిసిన దగ్గర నుంచి ఫ్యాన్స్ లో ఆనందం డబుల్ అయ్యింది.

బాలయ్య అన్ స్టాపబుల్ షో మొదటి సీజన్ ని విజయవంతంగా పూర్తి చేసిన బాలకృష్ణ… ఇప్పుడు అదే ఊపులో సెకండ్ సీజన్ ని కూడా పరుగులు పెట్టిస్తున్నారు. ఈ సీజన్ లో చాలా మంది సెలబ్రెటీలు హాజరయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. త్వరలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. కాగా తాజాగా బాలయ్య షోకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ నేడు అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. అయితే పవన్ వస్తున్నారని తెలుసుకున్నా ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ వాహనం రాగానే ఫ్యాన్స్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ ఓ రేంజ్ లో రచ్చ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే షూటింగ్ కు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట ఫుల్ గా ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఈ ఎపిసోడ్ త్వరలోనే టెలికాస్ట్ కానుంది. ఇక బాలయ్య పవన్ ను ఎలాంటి ప్రశ్నలు అడిగారు. పవన్ చెప్పిన సమాదానాలు ఏంటి అనేది తెలుసుకోవడనికి ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version