Site icon Prime9

Pawan Kalyan: ఏపీలో వారాహిని ఆపుతారా? పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ సమాధానం

pawan kalyan

pawan kalyan

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం జనసేన పార్టీ ప్రచార రథం ‘వారాహి’కి వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ వారాహి ని ప్రారంభించారు.

కొండగట్టులో పవన్ పర్యటన సందర్భంగా ఆయన చూసేందుకు అభిమానులు , జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అభిమానులు పవన్ కళ్యాణ్ ను గజమాలతో సత్కరించారు.

ఆ సందర్భంగా ఓపెన్ టాప్ వాహనం నుంచి అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై కామెంట్స్ చేశారు.

 

ఏపీలో పవన్ యాత్ర ఎలా జరుగబోతోంది..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం వారాహిని పరిచయం చేసినప్పటి నుంచి ఏపీ ప్రభుత్వం ఏదో ఒక పేచీ పెడుతూనే ఉంది.

వాహనం రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఏపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. అదేవిధంగా ఏపీలో బహిరంగ సభలు.. రోడ్ షోల నిర్వహించడంపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం జీవో 1 ను తీసుకొచ్చింది.

ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప రోడ్లపైన వాటి నిర్వహణకు అనుమతి నిరాకరించింది. అయితే ఈ జీవో పై రాష్ట్రంలో రాజకీయం పెద్ద దుమారమే చెలరేగింది. అయితే ఇదే అంశంపై పవన్ కళ్యాణ్

స్పందించారు.

జీవో 1 లాంటి ఆంక్షల నేపథ్యంలో ఏపీలో పవన్ యాత్ర ఎలా జరుగబోతోంది.. అక్కడ వారాహిని ఆపుతారా? అని పవన్ కళ్యాణ్ ను మీడియా ప్రశ్నంచగా, దానికి ఆయన సమధానమిస్తూ..

‘ఇదేమీ రాకేట్ సైన్స్ కాదు బ్రహ్మవిద్య కాదు. ఏపీలో ఎవరు తిరగకూడదు. నిజంగా వైసీపీ ప్రభుత్వం చెబుతున్నట్టు 175 కి 175 గెలుస్తామనేనమ్మకం గానీ , విశ్వాసం గానీ ఉంటే ఇవన్నీ చేయరు.

కానీ వైసీపీ వాళ్లకు విశ్వాసం , నమ్మకం సన్మగిల్లుతోంది కాబట్టి వాళ్లకు ఉంటే ఇలాంటి జీవోలను తీసుకొస్తున్నారు.’అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

 

మరోవైపు జీవో నెంబరు 1 పై హైకోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వులో ఉంచింది.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్ధానం.. సోమవారం(జనవరి 23) వరకు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం జీవో నెంబర్ 1 తెచ్చిందని న్యాయవాదులు వాదనలు వినిపించారు.

ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసంది.

ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్

నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ ముఖ్య నేతలతో జనసేనాని సమావేశం కానున్నారు. అక్కడి నుంచి ఆయన ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరకుని ప్రత్యేక పూజలు చేస్తారు.

అక్కడి నుంచే అనుష్టుప్ నారసింహ యాత్రకు శ్రీకారం చుట్టునున్నారు పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా 31 నారసింహ క్షేత్రాలను ఆయన సందర్శించనున్నారు.

పవన్ పర్యటన సందర్భంగా కొండగట్టు, ధర్మపురి పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

పవన్ కొండగట్టు పర్యటన నేపథ్యంలో ఉదయం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గరకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

 

Exit mobile version