Janasena Pawankalyan: విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో జనసేన ప్రచార రధం వారాహికి పవన్ కళ్యాణ్ పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు సమర్పించారు.
ఆయన వెంట పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఉన్నారు.
వీరికి దేవస్థానం ఈవో భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అంతరాలయం ద్వారా అమ్మవారిని దర్శించుకున్న పవన్ దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ఆవరణలో వేద పండితులు జనసేనానికి ఆశీర్వచనం అందజేశారు.
అయితే ఈ సందర్భంగా పవన్ అమ్మవారికి సమర్పించిన చీర ధర ఎంత? దీనిని అమ్మవారికి ఎప్పుడూ కడతారు అనే విషయాలు ఆసక్తిగా మారాయి.
కాగా ప్రైమ్ 9 న్యూస్ ఎక్స్ క్లూజివ్ గా ఆ వివరాలను తెలుసుకుంది.
పవన్ కళ్యాణ్ అమ్మవారికి సమర్పించిన చీర 8 వేల రూపాయలు అని సమాచారం అందుతుంది.
ఈ మేరకు ఆ చీరను ఫిబ్రవరి 6 వ తేదీన అమ్మవారికి కడతారని ఆలయ అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం అమ్మవారిక పవన్ సమర్పించిన చీర ఫోటోలు వైరల్ గా మారాయి.
‘దుర్గాదేవి ని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. ఇన్నేళ్లలో తల్లి నుంచి పిలుపురాలేదు.
ఇవాళ తల్లి దుర్గమ్మ పిలిపించుకొని ఆశీస్సులు అందజేసింది.
నిన్న కొండగట్టులో వారాహి పూజను నిర్వహించాం. ఇవాళ దుర్గమ్మ చెంత వారాహికి పూజలు నిర్వహిస్తున్నాం’ అని పవన్ పేర్కొన్నారు.
అలానే గుడిలో రాజకీయాల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు.
బయటికి వచ్చిన తర్వాత వారాహి నుంచి వాటి గురించి మాట్లాడతా అని తెలిపారు.
పవన్ రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపైనా కిందా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
కాగా కొండపైకి వారాహిని అనుమతించకపోవడంతో ఇంద్రకీలాద్రి కిందనే శాస్త్రోక్తంగా పవన్ పూజలు చేశారు.
మరోవైపు జనసేన వీర మహిళలు 108 బిందెలలో పసుపు, కుంకుమ కలిపిన నీళ్ళతో వారాహికి పూజ చేశారు.
అనంతరం పవన్ వారాహి పైకి ఎక్కి మాట్లాడారు.
రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని, అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు ముందుండాలని తాను కోరుకుంటానని చెప్పారు.
అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
అమ్మవారి చల్లని చూపు రాష్ట్ర ప్రజలపై ఉంటుందన్నారు.
ప్రచార రథానికి పూజ చేసేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చానని పవన్ చెప్పారు.
రాష్ట్రంలో జరిగే అరాచకాలు అమ్మవారు చూస్తుందని పవన్ పేర్కొన్నారు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/