Nagababu: రాబోయే ఎన్నికల్లో పవన్ ముఖ్యమంత్రి అవుతారని నాగబాబు (Nagababu) అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలిలో నిర్వహిస్తున్న యువశక్తి సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఘోరంగా ఓడించాలని ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు.
వివేకనందా జయంతి గురించి మాట్లాడిన నాగబాబు.. యువతకు సందేశం ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో యువత ఎక్కువ సేపు ఉండకూడదని సూచించారు. అది మంచిది కాదని.. యువత ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేయాలని సూచించారు.
నాగబాబు కామెంట్స్ వైరల్
రాజకీయాల గురించి యువత పట్టించుకోకపోతే.. అసమర్థ నాయకులు ఆధిపత్యం, నియంతృత్వంతో అణచివేస్తారని నాగబాబు (Nagababu) అన్నారు. యువత ఇప్పుడే మేల్కోవాలని లేదంటే వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల భవిష్యత్ తరాలు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.
రాబోయే ఎన్నికల్లో పవన్ ముఖ్యమంత్రి అవుతారని నాగబాబు అన్నారు. పవన్ ని ఆపే శక్తి రాష్ట్రంలో ఎవరికి లేదని.. పవన్ కి ఎదురొచ్చే ధైర్యం ఎవరికి లేదన్నారు. జనసేన పార్టీలో ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందని.. కులాలకు మతాలకు ప్రాధాన్యం ఉండదని అన్నారు. పవన్ సీఎం అయ్యే వరకు ప్రతి ఒక్క జనసైనికులు పార్టీ కోసం పాటుపడాలని కోరారు.
రాష్ట్రయువతకు పిలుపు
రాష్ట్రంలో యువత నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని.. లేదంటే రాష్ట్రంలో యువతకు భవిష్యత్ ఏం లేకుండా పోతుందని నాగబాబు హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ తన ఒక్కడి కోసం ఈ పార్టీ పెట్టలేదని.. రాష్ట్ర ప్రజల బాగు కోసమే జనసేన పార్టీ పెట్టారని నాగబాబు అన్నారు.
రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎన్ని కుట్రలు.. కుతంత్రాలు చేసిన జనసేన పార్టీని అడ్డుకోలేరని అన్నారు. ఇప్పటికే పవన్ ని చూస్తే వైసీపీ నేతలకు నిద్ర రావడం లేదన్నారు.
ఇవీ చదవండి:
Cs Somesh Kumar: మీకు కర్మసిద్దాంతం అంటే ఏమిటో తెలుసా? మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై తెలంగాణ టీచర్ సెటైర్లు
Veera Simha Reddy థియేటర్ లో మాస్ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. రచ్చ చేసిన ఫ్యాన్స్
Ram Charan-Upasana: నాతో కలిసి నా బిడ్డకూ ఇది స్పెషల్ ఎక్స్ పీరియన్స్.. ఉపాసన ఎమోషనల్ ట్వీట్
Veera Simha Reddy Unstoppable 2 Promo: వీరసింహారెడ్డి టీమ్‌తో బాలకృష్ణ.. అన్ స్టాపబుల్ షోలో రచ్చ మాములుగా లేదుగా
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/